STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 23rd April 2019
Markets_main1555991030.png-25279

క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ సూచీలు మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 126 పాయింట్లు జంప్‌చేసి 38,771 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 10,612 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. జీ టెలి, సిప్లా, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌లు 1-3 శాతం మధ్య ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేసాయి. మరోవైపు గెయిల్‌ షేరు 3 శాతం నష్టాలతో మొదలుకాగా,ఎన్‌టీపీసీ, టీసీఎస్‌, ఇన్‌ఫ్రాటెల్‌ షేర్లు 2 శాతం వరకూ క్షీణతతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 23rd April 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఎస్సెల్‌ ప్రోప్యాక్‌:- ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ మెజార్టీ వాటాను కొనుగోలు చేయనుంది. సంస్థ ప్రధాన ప్రమోటర్‌ అశోక్‌ గోయల్‌ ట్రస్ట్‌ నుంచి ప్రతి షేరు ధర రూ.134 వద్ద మొత్తం 51శాతం వాటాను రూ.2157లకు కొనుగోలు చేయనుంది. రెండో విడతలో ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో ప్రతి షేరు ధర రూ.139.19లు చొప్పున మొత్తం 26శాతం వాటాను రూ.1054లకు కొనుగోలు చేయనుంది.  పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:-

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ15 పాయింట్లు అప్‌

Tuesday 23rd April 2019

ప్రపంచ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ, క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌  మంగళవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50  గంటలకు 15 పాయింట్ల లాభంతో11,633 పాయింట్ల వద్ద కదులుతోంది. గత సోమవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌  ఫ్యూచర్‌ 11,618 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే సోమవారం రాత్రి అమెరికా సూచీలు స్వల్పనష్టాలతో  తాజాగా ఆసియా సూచీలన్నీ కొద్దిపాటి నష్టాలతో ట్రేడవుతున్నాయి.

Most from this category