STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం

Thursday 14th March 2019
Markets_main1552535698.png-24593

మూడురోజుల పాటు భారీ ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు గురువారం తిరిగి పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 80 పాయింట్లు లాభంతో 37840 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, 40 పాయింట్లు జంప్‌చేసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11382 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, జీ టెలి, యస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం ప్రారంభంలో 0.5 శాతం నుంచి 3 శాతం వరకూ పెరిగాయి. మరోవైపు టాటా మోటార్స్‌, హింద్‌ పెట్రో, బీపీసీఎల్‌, గ్రాసిమ్‌లు పాజిటివ్‌గా మొదలయ్యాయి. 

ఆసియా మార్కెట్లు మిశ్రమం

గత  రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు అరశాతంపైగా పెరిగాయి. తాజాగా ఆసియాలో చైనా షాంఘై సూచి ఒకశాతం నష్టపోగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి స్వల్పలాభంతో ట్రేడవుతోంది. జపాన్‌ నికాయ్‌ అరశాతం పెరిగింది. సింగపూర్‌ స్రె‍్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పిలు స్వల్పనష్టంతోనూ, తైవాన్‌ వెయిటెడ్‌ సూచి స్వల్పలాభంతోనూ కదులుతున్నాయి.   ఎటువంటి డీల్‌ లేకుండా బ్రెగ్జిట్‌ (యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) వద్దంటూ గత రాత్రి బ్రిటన్‌ పార్లమెంటు ఓటుచేసింది. ఈ కారణంగా బ్రెగ్జిట్‌ అంటూ జరిగితే యూరోపియన్‌ యూనియన్‌తో ఒక డీల్‌తోనే జరుగుతుంది. అయితే బ్రిటన్‌ ప్రధాని థెరేసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ డీల్‌ మంగళవారం బ్రిటన్‌ పార్లమెంటు తిరస్కరించిన సంగతి తెలిసింది. బుధవారంనాటి ఓటింగ్‌ ఫలితం దృష్ట్యా మరో కొత్త డీల్‌కు చర్చలు జరిగే అవకాశం వుంది. You may be interested

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 14th March 2019

వివిధ వార్తలను అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  లుపిన్‌:- నిర్వహణలో లోపం కారణంగా మధ్యప్రదేశ్‌లోని మన్‌దీప్‌ యూనిట్‌లో ఉత్పత్తులను నిలిపివేయాలని యూఎస్‌ఎఫ్‌డీఏ ఆదేశాలు జారీ చేసింది.  సాతిన్‌ కేర్‌క్రిడెట్‌ నెట్‌వర్క్‌:- కంపెనీ కమర్షియల్‌ పేపర్లపై రేటింగ్‌ సం‍స్థ కేర్‌ రేటింగ్‌ను ఎ(1) నుంచి ఎ(2)కు పెంచింది.  రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- నిధుల జారీ అభ్యర్థనపై ఎన్‌సీఎల్‌టీఏ స్టే విధించింది.  ఐఓసీ, ఓఎన్‌జీసీ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మధ్యంతర డివిడెండ్‌ను ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌

Thursday 14th March 2019

 బ్రెగ్జిట్‌ సందిగ్దత నేపథ్యంలోఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నప్పటికీ, మూడురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు గురువారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40 గంటలకు 11,386 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,366 పాయింట్ల వద్ద ముగిసింది. గత  రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌

Most from this category