STOCKS

News


10800 పైన ప్రారంభమైన నిఫ్టీ

Monday 25th February 2019
Markets_main1551067663.png-24306

ప్రపంచమార్కెట్లో నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 110 పాయింట్ల లాభంతో 35,983.80 వద్ద, నిప్టీ 21 పాయిం‍ట్ల లాభంతో 10800 పైన 10,813 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. చైనాతో వాణిజ్య చర్చలు సజావుగా సాగుతుండటంతో గతంలో చైనాకు చెందిన 200 మిలియన్ల డాలర్లపై దిగుమతులపై సుంకాల విధింపును మార్చి 1వరకు విధించిన గడువును మరింత కాలం పొడిగించే అవకాశం ఉందని అమెరికా శుక్రవారం ట్రంప్‌ ప్రకటనతో ప్రపంచమార్కెట్లలో సానుకూలా వాతావరణం నెలకొంది. జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం నిర్మాణంలో ఇళ్లపై జీఎస్టీ  12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంతో రియల్‌ఎస్టేట్‌ రంగ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు స్వల్పంగా పెరగడంతో పెట్రోరంగ కంపెనీలు షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది.అటో, మెటల్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో స్వల్పంగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 140 పాయింట్ల లాభంతో 36000 స్థాయిపైన 36010 వద్ద నిప్టీ 31 పాయిం‍ట్ల లాభంతో 10,824 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ క్రితం ముగింపు(71.14)తో పోలిస్తే 12పైసలు బలపడి 71.02 వద్ద ప్రారంభమైంది. 
హెచ్‌డీఎఫ్‌సీ, టాటాస్టీల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటామోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 1శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. మరోవైపు హెచ్‌సీఎల్‌, బీపీసీఎల్‌, ఇన్ఫ్రాటెక్‌, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 5.50శాతం నష్టపోయాయి.You may be interested

ఒడిదుడుకుల వారం

Monday 25th February 2019

గురువారం.. క్యూ3 జీడీపీ గణాంకాలు, జనవరి ద్రవ్యలోటు, ఇన్‌ఫ్రా అవుట్‌పుట్‌ డేటా శుక్రవారం.. నికాయ్‌ తయారీ రంగ పీఎంఐ, ఆటో రంగ అమ్మకాల గణాంకాలు ఈవారంలోనే ఫిబ్రవరి ఎఫ్‌ ఎండ్‌ ఓ సిరీస్‌ ముగింపు భారత్–పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై ఇన్వెస్టర్ల దృష్టి భారీ ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందన్న ఎపిక్‌ రీసెర్చ్‌ ముంబై: స్థూల ఆర్థిక సమాచారం, వెంటాడుతున్న భారత్–పాక్‌ యుద్ధ భయాలు, వాణిజ్య యుద్ధ అంశంపై అమెరికా–చైనాల మధ్య వాషింగ్టన్‌లో జరగనున్న చర్చలు ఈ వారం

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 25th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఎన్‌బీఎఫ్‌సీ:- నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ వ్యవస్థలోని అసెట్‌ ఫైనాన్స్‌, లోన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ విభాగాలను విలీనం చేసి ఎన్‌బీఎఫ్‌సీ - ఐసీసీగా మార్చేందుకు  రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆమోదం తెలిపింది.  మోతీలాల్‌, ఇండియా ఇన్ఫోలైన్‌:- ఎన్‌ఎస్‌ఈఎల్‌కు చెందిన మోసపూరిత కాంట్రాక్టుల విక్రయాలకు ఆ రెండు సంస్థలు ఉద్దేశపూర్వకంగా సహకరించినందుకు సెక్యూరిటీ అండ్‌ ఎక్చ్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా( సెబీ) ఈ రెండు సంస్థలకు చెందిన కమోడిటీ

Most from this category