STOCKS

News


లాభాల ప్రారంభం

Wednesday 14th August 2019
Markets_main1565754978.png-27744

క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో పాజిటివ్‌గా మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 275 పాయింట్ల లాభంతో 37233 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్ల లాభంతో 11,003 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ప్రారంభమైన కొద్ది నిముషాలకే లాభాల్లో కొంతభాగాన్ని కోల్పోయాయి. గత రాత్రి కొన్ని చైనా ఉత్పత్తులపై టారీఫ్‌ల పెంపుదలను డిసెంబర్‌ 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు, మరికొన్ని ఉత్పత్తులపై పెంపుదలను నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించడంతో అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతం వరకూ ర్యాలీ జరిపాయి. ఆ ప్రభావంతో తాజాగా ఆసియా సూచీలు సైతం లాభాలతో ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో జీ టెలి, టాటా స్టీల్‌, వేదాంత, యస్‌బ్యాంక్‌లు 2-3 శాతం మధ్య పెరిగాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మాలు 5 శాతం వరకూ పతనంకాగా, సిప్లా, విప్రోలు 2 శాతం వరకూ నష్టపోయాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 14th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  ఫ్యూచర్‌ రీటైల్‌:- అమెజాన్‌ సంస్థ 8నుంచి 10శాతం వాటాను కొనుగోలుకు చర్చలు జరుపుతోంది.  ఎంఅండ్‌ఎం:- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ ధీర్ఘకాలిక ఇష్యూయర్‌/ఇన్‌స్ట్రూమెంట్‌ రేటింగ్‌ను ఇండియా ఎఎఎగానూ,  అవుట్‌లుక్‌ స్థిరత్వంగానూ కేటాయించింది.  ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ ఇంజనీరింగ్స్‌:- గాయత్రి ప్రాజెక్ట్‌ కన్షారియం జాయింట్‌ వెంచర్‌తో కలిసి నాగాలాండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ సంబంధించి రూ.914.3కోట్ల విలువైన ఆవార్డును దక్కించుకున్నట్లు ప్రకటించింది. విప్రో లిమిటెడ్‌:- ఇంటెల్ ఆధారిత ఎడ్జ్ ఆర్టిఫిషియల్

క్యూ1 ఫలితాలు: రాణించిన సన్‌ ఫార్మా

Tuesday 13th August 2019

సన్ ఫార్మాస్యూటికల్స్ మంగళవారం ప్రకటించిన జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలలో, ఏడాది ప్రాతిపదికన లాభం 31.22 శాతం పెరిగి రూ. 1,387.48 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 1,057.29 కోట్లుగా ఉంది. కాగా ఈ త్రైమాసికంలో ఈ కంపెనీ లాభం రూ. 994 కోట్లుగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో ఆదాయం 15.69 శాతం పెరిగి రూ .8,259.30 కోట్లకు

Most from this category