STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 13th August 2019
Markets_main1565666873.png-27723

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌తో ప్రపంచ మార్కెట్లు క్షీణించినా, భారత్‌ సూచీలు మాత్రం మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 173 పాయింట్ల లాభంతో 37.775 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11.3340 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ఇన్వెస్టర్లకు కేంద్రం పలు పన్ను రాయితీలు ప్రకటించవచ్చన్న అంచనాలు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌...సౌదీ అరామ్‌కోతో రూ. లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రకటించడం వంటి అంశాలు ఇక్కడి మార్కెట్లు లాభాలతో ప్రారంభంకావడానికి కారణమయ్యాయి.

రిలయన్స్‌ అప్‌....

సౌదీ అరామ్‌కోతో రూ. లక్ష కోట్ల పెట్టుబడి ఒప్పందాన్ని ప్రకటించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 6 శాతం గ్యాప్‌అప్‌తో రూ.1.233 వద్ద ప్రారంభమయ్యింది. 

 

ప్రపంచ సూచీలు డౌన్‌...

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ఉధృతమవుతున్న సూచనలు కన్పించడం, అర్జింటీనా కరెన్సీ పెసో తీవ్రంగా పతనంకావడం, హాంకాంగ్‌లో ప్రజా ఆందోళన వంటి అంశాల నేపథ్యంలో తాజాగా ఆసియా మార్కెట్లు బాగా తగ్గాయి. జపాన్‌ నికాయ్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌లు 1.5 శాతం వరకూ పతనంకాగా, చైనా, సింగపూర్‌, తైవాన్‌, కొరియా సూచీలు సైతం 0.75 శాతం వరకూ నష్టపోయాయి. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1.4 శాతం వరకూ పడిపోయాయి. 

 



You may be interested

రిలయన్స్‌ ర్యాలీ....8 శాతం అప్‌

Tuesday 13th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ఆయిల్‌ రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌  విభాగాలలో  సౌదీ ఆరామ్‌తో లక్ష కోట్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో ఈ కంపెనీ షేరు మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 6 శాతంగ్యాప్‌అప్‌తో మొదలై, క్షణాల్లో మరో 3 శాతం ఎగబాకి రూ.1,268 వద్ద గరిష్టస్థాయిని నమోదుచేసింది. ఉదయం 9.21 సమయానికి 7.99 శాతం పెరిగి రూ. 1,254.90 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో(శుక్రవారం)  రూ.1,162.10 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం ట్రేడింగ్‌లో రూ. 1,233.15

రెండేళ్లలో రిలయన్స్‌ షేరు రెట్టింపు?

Monday 12th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో ప్రకటించిన నిర్ణయాలు కంపెనీ భవిష్యత్తును ఆకర్షణీయంగా మార్చేవిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మంగళవారం స్టాక్‌ ఐదు శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని, రెండేళ్లు ఓపిక పడితే ఈ స్టాక్‌ రెట్టింపు అవుతుందని పేర్కొంటున్నారు. ‘‘ఆర్‌ఐఎల్‌ 65 బిలియన్‌ డాలర్ల రుణంపై క్రెడిట్‌ సూసే ఆందోళన సరైనది కాదు.  రూ.4 లక్షల కోట్ల నికర విలువ కలిగి ఉండడంతోపాటు, రిఫైనరీ, ఆయిల్‌ కెమికల్స్‌, రిటైల్‌, జియో వ్యాపారాలు

Most from this category