STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 18th March 2019
Markets_main1552880614.png-24654

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై సరళ వైఖరి అవలంబిస్తుందనే అంచనాలతో ఆసియా మార్కెట్లు పెరిగిన నేపథ్యంలో సోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌108 పాయింట్లు జంప్‌చేసి 38,133 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 47 పాయింట్ల పెరుగుదలతో 11474 పాయింట్ల వద్ద మొదలయ్యింది. బుధవారం వెలువడనున్న ఫెడ్‌ సమీక్షా నిర్ణయం బాండ్‌, ఈక్విటీ మార్కెట్లకు ఊపునిస్తుందన్న అంచనాలు, గత శుక్రవారం వెలువడిన గణాంకాల ప్రకారం భారత్‌ వాణిజ్యలోటు భారీగా తగ్గడం వంటి అంశాలు తాజాగా భారత్‌ సూచీలు మరింత పెరగడానికి కారణమయ్యాయి. గత వారం ఈ సూచీలు 3.5 శాతం జంప్‌చేసిన సంగతి తెలిసింది. కాగా తాజా ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐఓసీ, కొటక్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, పవర్‌గ్రిడ్‌, హింద్‌ పెట్రో షేర్లు 1-4 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు మారుతి, గ్రాసిమ్‌, వేదాంతలు 1-2 శాతం మధ్య నష్టపోయాయి. 

 



You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 18th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు  బంధన్‌ బ్యాంక్‌:-  గృహ్‌ ఫైనాన్స్‌ విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆర్‌బీఐ తమకు లేఖ రాసిందని బంధన్‌ బ్యాంక్‌ శుక్రవారం స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.  జై ప్రకాశ్‌ అసోసియేట్స్‌:- కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌, సీఈవోగా మనోజ్‌ గౌర్‌, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సునీల్‌ కుమార్‌ శర్మలను పదవిలో మరో మూడేళ్ల పాటు కొనసాగేందుకు బోర్డు

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Monday 18th March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై సరళవైఖరి అవలంబిస్తుందనే అంచనాలతో ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో గతవారం పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు ఈ వారం తొలిరోజైన సోమవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.35 గంటలకు 11,510 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ

Most from this category