STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం, వెంటనే నష్టాల్లోకి

Wednesday 13th March 2019
Markets_main1552449033.png-24568

బుధవారం పాజిటివ్‌గా ప్రారంభమైన స్టాక్‌ సూచీలు... వెనువెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. 37,600 పాయింట్ల పైన 70 పాయింట్ల లాభంతో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 37,500 దిగువకు క్షీణించగా, 10,326 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,300 పాయింట్ల దిగువకు తగ్గింది. గత రాత్రి బ్రిటన్‌ ప్రధాని థెరాసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ డీల్‌..ఆ దేశపు పార్లమెంటు తిరస్కారానికి గురైన నేపథ్యంలోఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌ సూచీలు ట్రేడింగ్‌ ప్రారంభంలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. టెక్‌ షేర్లు హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌లు స్వల్ప లాభాలతో మొదలుకాగా, పెట్రో మార్కెటింగ్‌ షేర్లు బీపీసీఎల్‌, ఐఓసి, హెచ్‌పీసీఎల్‌లు నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. 

నష్టాల్లో ప్రపంచ మార్కెట్లు

గత  రాత్రి అమెరికాలో బోయింగ్‌ పతనం కారణంగా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ 90 పాయింట్ల వరకూ తగ్గినప్పటికీ, నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆసియాలో తైవాన్‌ మినహా మిగిలిన మార్కెట్లన్నీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ సూచి 1.4 శాతం వరకూ క్షీణించింది. ఎటువంటి డీల్‌ లేకుండా బ్రెగ్జిట్‌ (యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడం) జరగాలా లేక బ్రెగ్జిట్‌ను వాయిదా వేయాలా లేక మరో రిఫరెండం నిర్వహించాలా అనే అంశాలపై బుధ, గురువారాల్లో బ్రిటన్‌ పార్లమెంటులో ఓటింగ్‌ జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఈ కారణంగా యూరప్‌, అమెరికా ఇండెక్స్‌ ఫ్యూచర్లు కూడా తాజాగా స్వల్ప తగ్గుదలతో కదులుతున్నాయి. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 13th March 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు  మెజెస్కో:- అమెరికా అనుబంధ సంస్థ యూరోపిన్‌ కార్యనిర్వహణ అధికారిగా నార్మన్‌ కారోల్‌ను నియమిస్తున్నట్లు ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.  ఎమ్‌ఎస్‌టీసీ:- నేడు ఐపీఓ ప్రారంభం కానుంది. ప్రైజ్‌బాండ్‌ రూ.121-128లుగా నిర్ణయించారు. ఎన్‌ఎమ్‌డీసీ:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రూ.1 ముఖవిలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.52 చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు రికార్డు తేదిని మార్చి 25గా నిర్ణయించింది. అవెన్యూ సూపర్‌మార్ట్‌:- రూ.100 కోట్ల విలువైన

ఫ్లాట్‌గా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 13th March 2019

గత రాత్రి బ్రిటన్‌ ప్రధాని థెరాసా మే ప్రతిపాదించిన బ్రెగ్జిట్‌ డీల్‌..ఆ దేశపు పార్లమెంటు తిరస్కారానికి గురైన నేపథ్యంలోఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్నప్పటికీ, భారత్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 2 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 11,337 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,335 పాయింట్ల వద్ద

Most from this category