News


 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు అప్‌ 

Friday 15th March 2019
Markets_main1552619166.png-24613

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యిందనేవార్తలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో నాలుగురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.35 గంటలకు 11,402 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,382  పాయింట్ల వద్ద ముగిసింది. గత  రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా ఆసియాలో చైనా షాంఘై ఇండెక్స్‌ 2 శాతం జంప్‌చేయగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి 1 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. జపాన్‌ నికాయ్‌ కూడా 1 శాతం పెరిగింది. సింగపూర్‌ స్రె‍్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పిలు  తైవాన్‌ వెయిటెడ్‌ సూచీలు అరశాతం లాభంతోనూ కదులుతున్నాయి.   



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 15th March 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమ‌య్యే షేర్ల  వివరాలు ఐడీబీఐ బ్యాంక్‌:- ఐడీబీఐ బ్యాంక్‌ను ప్రవేట్ రంగ సెక్టారులోకి చేరుస్తున్నట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రక‌టించింది. జీవిత బీమా సంస్థ మెజారిటీ వాటాను కొనుగోలు నేపథ్యంలో ఈ వర్గీకరణ జరిగింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 21 నుంచి ఇది అమల్లోకి వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. టైడ్ వాట‌ర్ ఆయిల్(ఇండియా):-  ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంలో రెండో మ‌ధ్యంతర డివిడెండ్‌ను ప్రక‌టించింది. రూ.5లు ముఖవిలువ

ఉన్నట్టుండి ఎఫ్‌పీఐల నిధుల వరద...!?

Thursday 14th March 2019

గత నెల వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు సాగిస్తూ వచ్చారు. ముఖ్యంగా గతేడాది భారత స్టాక్స్‌ను పెద్దగా పట్టించుకోని ఎఫ్‌పీఐలు ఉన్నట్టుండి నికర కొనుగోలుదారులుగా మారారు. దీని వెనుక కారణాలను పరిశీలిస్తే... లిక్విడిటీ పరిస్థితులు మెరుగయ్యాయి. చమురు ధరలు గతేడాది గరిష్ట స్థాయిలకు చేరిన తర్వాత తిరిగి చల్లబడ్డాయి. కంపెనీల ఎర్నింగ్స్‌ రికవరీ అవుతాయన్న అంచనాలకుతోడు లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరంగా

Most from this category