STOCKS

News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌...నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌

Friday 25th January 2019
Markets_main1548387449.png-23790

సెన్సెక్స్‌ 200 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లు జంప్‌

ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో శుక్రవారం భారత్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 36,395 పాయింట్ల వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల పెరుగుదలతో 10,910 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు అప్‌ట్రెండ్‌ను కొనసాగిస్తూ యస్‌ బ్యాంక్‌ మరో​ 8 శాతం ట్రేడింగ్‌ ప్రారంభంలో జంప్‌చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, యూపీఎల్‌, వేదాంతలు 1 శాతంపైగా లాభంతో మొదలయ్యాయి. హీరో మోటో కార్‌‍్ప, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లు స్వల్పనష్టాలతో మొదలయ్యాయి. 

ఆసియా సూచీలు అప్‌..

గత రాత్రి అమెరికా సూచీల్లో డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ స్వల్పనష్టంతో ముగిసినా, టెక్నాలజీ షేర్ల సాయంతో నాస్‌డాక్‌ పెరగడం, యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ సరళ విధానాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించడం, అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న చర్చలు వచ్చేవారం సానుకూలంగా ముగుస్తాయన్న అంచనాలతో శుక్రవారం ఆసియా సూచీలు జోరుగా పెరిగాయి. ఉదయం 9.15 గంటల సమయానికి జపాన్‌ నికాయ్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, తైవాన్‌ వెయిటెడ్‌, కొరియా కోస్పిలు 1 శాతం జంప్‌చేయగా, చైనా షాంఘై, సింగపూర్‌ స్ర్టయిట్‌టైమ్స్‌ సూచీలు 0.5 శాతం పెరిగాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 25th January 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌:- రణజయ్‌ దత్తాను ఐదేళ్ల కాలానికి కంపెనీ సీఈవోగా నియమిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. యస్‌ బ్యాంక్‌:- అదనపు డైరెక్టర్లుగా మహేశ్వర్‌ సాహూ, అనిల్‌ జగ్గాయ్‌లను నియమించింది. భారతీ ఎయిర్‌టెల్‌:- అదనపు డైరెక్టర్‌, నాన్‌- ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ప్రకూల్‌ కౌశివలను నియమించారు. దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- కమర్షియల్‌ పేపర్ల జారీ ప్రక్రియను పూర్తిచేసింది. కద్రా కన్‌స్ట్రక‌్షన్‌:- రూ.100 కోట్ల విలువైన ఎస్‌సీడీల జారీ చేసింది. దీపక్‌ ఫెర్టిలైజర్స్‌:- కమర్షియల్‌

నేడే స్పెన్సర్స్‌ రిటైల్‌ లిస్టింగ్‌

Friday 25th January 2019

సీఈఎస్‌సీ వెంచర్స్‌ కూడా ఆర్‌పీ సంజీవ్‌ గోయంకా గ్రూపులోని సీఈఎస్‌సీ నుంచి డీమెర్జర్‌ చేసిన స్పెన్సర్స్‌ రిటైల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌ కంపెనీల షేర్లు శుక్రవారం (జనవరి 25న) ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో లిస్ట్‌ కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా గురువారం ప్రకటించింది. పశ్చిమబెంగాల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ సీఈఎస్‌సీ డీమెర్జర్‌కు సంబంధించిన సమాచారాన్ని, వివరణను కోరగా... దీనిపై కంపెనీ వివరణ కూడా ఇచ్చింది. కంపెనీ నుంచి వేరు చేస్తున్న కంపెనీలకు మాతృ

Most from this category