News


స్వల్పలాభాలతో ప్రారంభం

Friday 11th January 2019
Markets_main1547178417.png-23516

సెన్సెక్స్‌ 85 పాయింట్లు, నిఫ్టీ 13 పాయింట్లు అప్‌

ఆసియా మార్కెట్లు సానుకూల ట్రేడింగ్‌ ప్రభావంతో భారత్‌ మార్కెట్‌ శుక్రవారం స్వల్పలాభాలతో మొదలయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 36,192 పాయింట్ల వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల పెరుగుదలతో 10,834 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. క్రితం రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన ఐటీ దిగ్గజం టీసీఎస్‌ 1 శాతం నష్టంతో రూ. 1,870 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇతర ఐటీ షేర్లు టెక్‌ మహింద్రా, విప్రో, హెచ్‌సీఎల్‌టెక్‌లు కూడా స్వల్ప నష్టాలతో మొదలయ్యాయి. ఇక యస్‌బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌లు ట్రేడింగ్‌ ప్రారంభంలో స్వల్పంగా పెరిగాయి. 

ఆసియా సూచీలు పాజిటివ్‌

 ఆసియా మార్కెట్లో జపాన్‌ సూచి నికాయ్‌ 0.7 శాతం పెరగ్గా, హాంకాంగ్‌, సింగపూర్‌, తైవాన్‌, కోస్పి సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. గత రాత్రి స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన అమెరికా సూచీలు పాజిటివ్‌గా ముగిసాయి. 



You may be interested

కలిసిరాని ఫలితాలు...టీసీఎస్‌ 2 శాతం డౌన్‌

Friday 11th January 2019

2శాతం నష్టపోయిన షేరు దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఫలితాలు ఆ కంపెనీ షేరుకు కలిసిరాలేదు. ఫలితంగా శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఈ కంపెనీ షేరు ఏకంగా 2శాతం నష్టపోయింది. ఈ క్యూ3లో టీసీఎస్‌ లాభాల పంటపండిచినప్పటీకి కంపెనీ షేరు మాత్రం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు ఎన్‌ఎస్‌లో 1శాతం నష్టంతో రూ.1870ల వద్ద షేరు ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఉదయం గం.9:25ని.లకు

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 11th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:- జామ్నా నగ‌ర్‌లోని చ‌మురు శుద్ది యూనిట్‌ను నెల‌రోజు పాటు ష‌ట్‌డౌన్ చేసేందుకు ప్రణాళిక‌లు సిద్ధం చేస్తుంది.  యూనిట్లో యంత్రాల ప‌నితీరును త‌నిఖీ చేసే ప్రక్రియ‌లో భాగంగా జ‌న‌వ‌రి 16నుంచి 4వారాల పాటు మూసివేస్తున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. హెచ్ఎఫ్‌సీఎల్‌:- ఎల్అండ్ టీ, ఐటీఐ క‌న్షారియంల నుంచి రూ.500 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకుంది. భార‌త్ నెట్ ఫేజ్‌-2 ప్రాజెక్ట్‌లో భాగంగా

Most from this category