News


స్వల్పలాభాలతో ప్రారంభం

Wednesday 23rd January 2019
Markets_main1548215475.png-23738

సెన్సెక్స్‌ 49 పాయింట్లు, నిఫ్టీ 9 పాయింట్లు అప్‌

గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతం తగ్గుదలతో ముగిసినప్పటికీ, బుధవారం ఉదయం ఆసియా సూచీలు స్థిరంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌ మార్కెట్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్లు పెరిగి 36,494 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 10,931 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో యస్‌బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, హీరోమోటోలు స్వల్పలాభాలు ఆర్జించాయి. మరోవైపు హింద్‌ పెట్రో, బీపీసీఎల్‌, సన్‌ఫార్మా, యాక్సిస్‌బ్యాంక్‌లు స్వల్పంగా నష్టపోయాయి. 

అమెరికా మార్కెటు​ డౌన్‌

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తుందంటూ ఐఎంఎఫ్‌ విడుదల చేసిన అంచనాల కారణంగా గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతంపైగా పడిపోయాయి. డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ 300 పాయింట్లు, ఎస్‌ అండ్‌ పీ500 సూచి 30 పాయింట్ల చొప్పున క్షీణించగా, టెక్నాలజీ ఇండెక్స్‌ నాస్‌డాక్‌70 పాయింట్లుపైగా నష్టపోయింది. ఇక తాజాగా ఆసియా సూచీల్లో జపాన్‌, సింగపూర్‌లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతుండగా, హాంకాంగ్‌, తైవాన్‌, కొరియా సూచీలు స్వల్పలాభాలతో కదులుతున్నాయి. 



You may be interested

మూడు వారాల కనిష్టం నుంచి కోలుకున్న పసిడి

Wednesday 23rd January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి 3వారాల కనిష్టం నుంచి పుంజుకుంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనం పసిడి రికవరికి దోహదపడ్డాయి. ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వృద్ధి అంతంత మాత్రంగా ఉంటుందనే ఐక్యరాజ్యసమితి నివేదకలు వెల్లడించడంతో ఐరోపా, అమెరికా, ఆసియా ఈక్విటీ మార్కెట్లు నష్టాల పట్టాయి. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లకు వ్యతిరేకంగా ట్రేడయ్యే పసిడి రాత్రి అమెరికా మార్కెట్లో 7డాలర్లు లాభపడి 1283.40 వద్ద ముగిసింది. నిన్న ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో డాలర్‌

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 23rd January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:- డెన్ నెట్‌వ‌ర్క్స్‌, హాత్‌వే కేబుల్స్ కంపెనీల కొనుగోలుకు కాంపీటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా అనుమ‌తినిచ్చింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేష‌న్ నెట్‌వ‌ర్క్స్‌:- కంపెనీలో ద్రవ్యకొర‌త కార‌ణంగా డిబెంచ‌ర్ హోల్డర్లకు జ‌న‌వ‌రి 22వ తేదిన వ‌డ్డీ చెల్లింపుల్లో విఫ‌ల‌మైంది. స‌చేతా మెట‌ల్స్‌:- వివిధ దేశాల నుంచి కంపెనీ మొత్తం రూ.40 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. సైయెంట్‌:- త‌న అనుబంధ సంస్థ

Most from this category