STOCKS

News


3 నెలల వరకూ పాజిటివ్‌ రిటర్న్స్‌కు నో ఛాన్స్‌..

Friday 28th September 2018
Markets_main1538131580.png-20682

ఈక్విటీ మార్కెట్లు వచ్చే మూడు నెలలపాటు పాజిటివ్‌ రిటర్న్స్‌ అందించకపోవచ్చని ఇండియా జెన్‌ ఫండ్‌ డైరెక్టర్‌/ సీఐవో, పీఎంఎస్‌ హెడ్‌ (ఈక్విటీస్‌) మనీశ్‌ సంతాలియా తెలిపారు. ఆగస్ట్‌ 28 నాటి రికార్డ్‌ గరిష్ట స్థాయి నుంచి చూస్తే సెన్సెక్స్‌ 2,500 పాయింట్లకుపైగా పతనమైందని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కారణంగా తలెత్తిన లిక్విడిటీ భయాలు, రూపాయి అస్థిరత, క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపారు. ‘ప్రస్తుత పతనం లేమాన్‌ సంక్షోభ గతాన్ని గుర్తుకు తెస్తోంది. అప్పడు మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ స్తబ్దుగా మారింది. ప్రస్తుతం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కారణంగా నెగటివ్‌ పరిస్థితులు తలెత్తాయి. ఈ కంపెనీ సెప్టెంబర్‌ 12-27 మధ్యకాలంలో బాండ్‌ హోల్డర్లకు చెల్లింపుల విషయంలో ఏడు సార్లు డిఫాల్ట్‌ అయ్యింది. ఈ పరిస్థితులు ఈక్విటీ మార్కెట్లకు విస్తరించకూడదని భావిస్తున్నాం’ అని వివరించారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సమస్య కొనసాగితే.. మార్కెట్లలో తదుపరి డౌన్‌ట్రెండ్‌ ఉంటుందని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ లిక్విడిటీ భయాలు ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో ఆందోళనలకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీంతో సంబంధిత స్టాక్స్‌ సెప్టెంబర్‌లో 15-60 శాతం నష్టపోయాయి. 
ఆర్‌బీఐ ప్రత్యక్షంగా ఎన్‌బీఎఫ్‌సీలకు ఫండింగ్‌ ఏర్పాటు చేయడం ఉత్తమమని మనీశ్‌ సంతాలియా అభిప్రాయపడ్డారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో రిడంప్షన్లు ఇప్పటికీ గరిష్ట స్థాయిల్లో ఉన్నాయని, . బాండ్లకు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ లేకపోవడం వల్ల మొత్తంగా స్థూల ఇన్వెస్ట్‌మెంట్లు తగ్గుతాయని పేర్కొన్నారు. ‘ఏదైనా అద్భుతం జరిగితే తప్ప వచ్చే మూడు నెలల కాలంలో పాజిటివ్‌ ఈక్విటీ రిటర్న్స్‌ ఉండకపోవచ్చు. ప్రస్తుతం క్యాషే కింగ్‌. అందువల్ల మార్కెట్లకు దూరంగా ఉండటం మంచిది’ అని తెలిపారు. రూపాయి బలహీనత వల్ల ఎక్స్‌పోర్ట్స్‌ రంగం ప్రయోజనం పొందిందని పేర్కొన్నారు. ఐటీ, ఫార్మా, ఇతర ఎగుమతి ఆధారిత కంపెనీల స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ఉత్తమమని తెలిపారు. You may be interested

నిలిచిపోయిన జెబ్‌పే సేవలు

Saturday 29th September 2018

ఎట్టకేలకు దేశీయ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్‌ జెబ్‌పే తన సేవల్ని నిలిపివేసింది. ట్రేడింగ్‌ సేవలను నిలిపివేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. అహ్మదాబాద్‌ కేంద్రంగా ఈ కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. ఎక్సేంజ్‌కు సంబంధించి అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నామని, పూర్తి కాని అన్ని ఆర్డర్లు రద్దవుతాయని, ఆయా ఫండ్స్‌ను కస్టమర్ల జెబ్‌పే వ్యాలెట్లకు క్రెడిట్‌ చేయడం జరుగుతుందని సంస్థ తెలిపింది.    బ్యాంకు అకౌంట్లపై నియంత్రణలతో తమ, తమ కస్టమర్ల వ్యాపార నిర్వహణ సామర్థ్యాన్ని కట్టేసినట్టయిందని

తీవ్ర హెచ్చుతగ్గులు: నష్టాలతో ముగింపు

Friday 28th September 2018

ముంబై:- శుక్రవారం ట్రేడింగ్‌ అద్యంతం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్‌ చివరికి నష్టంతో ముగిసింది. బలహీనమైన మార్కెట్‌ పరిస్థితులు సూచీల నష్టాల ముగింపునకు కారణమయ్యాయి. అటో, మెటల్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఫార్మా రంగాలకు చెందిన షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సెన్సెక్స్‌ 97 పాయింట్లు క్షీణించి 35,227 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు నష్టపోయి 10,696 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 35177 - 35438 పాయింట్ల శ్రేణిలో కదలాడగా,

Most from this category