News


లాభాల ముగింపు

Monday 7th January 2019
Markets_main1546857260.png-23452

సెన్సెక్స్‌ 155 పాయింట్లు, నిఫ్టీ 44 పాయింట్లు అప్‌

ప్రస్తుత వడ్డీ రేట్ల పెంపు పాలసీని పునర్‌సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ చేసిన ప్రకటనతో సోమవారం భారీగ్యాప్‌అప్‌తో భారత్‌ సూచీలు ప్రారంభమైనప్పటికీ, ముగింపులో ఆ లాభాలు అరశాతం లోపునకే పరిమితమయ్యాయి. ఒకదశలో 300 పాయింట్లకుపైగా పెరిగిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు 155 పాయింట్ల లాభంతో 35,809 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో 90 పాయింట్ల మేర పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 44 పాయింట్ల లాభంతో 10,772 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఆసియా సూచీలు సైతం ప్రారంభలాభాల్ని నిలుపుకోలేకపోవడం, యూరప్‌ సూచీలు ప్రతికూలంగా మొదలుకావడంతో మధ్యాహ్న సెషన్‌ నుంచి ఇక్కడ అమ్మకాలు మొదలయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 36,077 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 35,809 పాయింట్ల కనిష్టస్థాయికి, నిఫ్టీ 10,836 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10,750 కనిష్టస్థాయికి తగ్గాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌ షేర్లు 2-3 శాతం పెరగ్గా, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ, మారుతిలు 1.5 శాతంపైగా లాభంతో ముగిసాయి. మరోవైపు ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ 4 శాతంపైగా పతనమయ్యింది. బజాజ్‌ ఆటో 3శాతం నష్టపోయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ లాబ్‌, యస్‌ బ్యాంక్‌, ఐషర్‌ మోటార్స్‌, హిందాల్కోలు 1-2 శాతం మధ్య నష్టాలతో ముగిసాయి. కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ట్రేడింగ్‌ తొలిదశలో 27,477 పాయింట్ల గరిష్టస్థాయికి పెరిగిన తర్వాత..చివరకు 105 పాయింట్ల లాభంతో 27,300 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అంతర్జాతీయ ట్రెండ్‌ను అనుసరిస్తూ భారీ గ్యాప్‌అప్‌తో మొదలైన మెటల్‌ షేర్లు....వాటి ప్రారంభలాభాల్ని అన్నింటినీ కోల్పోయాయి. 



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ...   కొనొచ్చు

Monday 7th January 2019

బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.122 టార్గెట్‌ ధర: రూ.140 ఎందుకంటే..?: దేనా, విజయా బ్యాంక్‌లను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం చేయడానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి సంబంధించి షేర్ల మార్పిడి నిష్పత్తి దేనా, విజయ బ్యాంక్‌ల కంటే బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వాటాదారులకే లాభదాయకంగా ఉంది. ప్రతి వెయ్యి విజయ బ్యాంక్‌ షేర్లకు 402 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు, ప్రతి వెయ్యి దేనా బ్యాంక్‌

నార్నోలియా టాప్‌ సిఫార్సులు

Monday 7th January 2019

స్వల్పకాలానికి మంచి రాబడినిచ్చే ఐదు స్టాకులను నార్నోలియా రికమండ్‌ చేస్తోంది. 1. మనుప్పురం ఫైనాన్స్‌: టార్గెట్‌ రూ. 112. స్టాప్‌లాస్‌ రూ. 85.90. దీర్ఘకాలిక అప్‌మూవ్‌లో ఉంది. దిగువన రూ. 86 వద్ద నుంచి రెండు మార్లు బౌన్స్‌ బ్యాకై డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం అన్ని రకాల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. ఆర్‌ఎస్‌ఐ సహా ఇండికేటర్లు అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. 2. ఐడీఎఫ్‌సీ బ్యాంకు: టార్గెట్‌ రూ. 52. స్టాప్‌లాస్‌

Most from this category