STOCKS

News


ప్రతీ రూపాయి రెట్టింపు అవుతుంది.. తొందరపడొద్దు: పొరింజు

Sunday 9th December 2018
Markets_main1544378678.png-22779

దేశీయ స్టాక్‌ మార్కెట్లో ఇప్పుడున్న ప్రతీ రూపాయి ఏడాది క్రితం రెండు రూపాయలతో సమానమని, సెప్టెంబర్‌-అక్టోబర్‌లో వచ్చిన కరెక్షన్‌ వందలాది స్టాక్స్‌ విలువను హరించి వేసిందని స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా అధినేత పొరింజు వెలియాత్‌ అన్నారు. తన నిర్వహణలోని పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవల ద్వారా ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఆయన తాజాగా ఒక లేఖ రాశారు. ఇప్పుడు వెనక్కి తీసుకునే ప్రతీ రూపాయిని అలాగే ఉంచేస్తే, సమీప కాలంలోనే రెట్టింపునకు పైగా వృద్ధి చెందుతుందని ఆయన ఇన్వెస్టర్లకు హితవు పలికారు.  

 

ఇటీవలి కరెక్షన్‌ పొరింజు పోర్ట్‌ఫోలియో విలువను తీవ్రంగా దెబ్బతీసింది. కారణం పొరింజు పోర్ట్‌ఫోలియో అధిక భాగం స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌తో ఉండడం, కరెక్షన్‌ కూడా ఎక్కువగా స్మాల్‌, మిడ్‌క్యాప్‌లోనే చోటు చేసుకోవడం గడ్డు పరిస్థితులకు దారితీసింది. సెబీ గణాంకాలను పరిశీలిస్తే పొరింజు పీఎంఎస్‌ వ్యాల్యూషన్‌ సెప్టెంబర్‌ మాసంలో 20 శాతం నష్టపోయింది. అక్టోబర్‌లో 3.6 శాతం, నవంబర్‌లో 2 శాతం నష్టాలను చవిచూసింది. జూలైలో మాత్రం 3.70 శాతం, ఆగస్ట్‌లో 6.33 శాతం లాభాన్ని నమోదు చేసింది. అక్టోబర్‌ కరెక్షన్‌ నుంచి నవంబర్‌లో మార్కెట్లు చాలా వరకు నష్టాలను కవర్‌ చేసుకున్నాయి. అయితే, ఈ రికవరీ అంతా మోసమేనని, 15-20 బ్లూచిప్‌ స్టాక్స్‌ రికవరీని నడిపించాయన్నది పొరింజు అభివర్ణన. మార్కెట్‌లో మొత్తం మీద మందకొడితనం ఉన్నట్టు పొరింజు పేర్కొన్నారు. రికవరీ జరగాల్సి ఉందన్నారు. మార్కెట్‌ నష్టాలకు కారణమైన చమురు ధరల పెరుగుదల, రూపాయి బలహీనత లేదా ట్రేడ్‌ వార్‌ ఇవన్నీ కాస్త కుదురుకున్నట్టు చెప్పారు. అలాగే, సెప్టెంబర్‌ త్రైమాసికం ఆదాయాలు దేశీయ వినియోగం బలంగానే ఉందని తెలియజేస్తున్నట్టు చెప్పారు. 

 

2019లో తిరిగి మోదీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఇటీవలే పొరింజు జోష్యం చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలు మార్కెట్‌కు ముఖ్యమైన అంశం కాదని తాజాగా పొరింజు అన్నారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కంపెనీల ఫలితాలు, వ్యాల్యూషన్లే ముఖ్యమని సూచించారు. దీర్ఘకాలం కోసం ఈ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు చేయాల్సిందేమీ లేదన్నారు. బేరిష్‌ ట్రెండ్‌ పోయి 2009 తరహా బుల్‌రన్‌ వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మనం ఇన్వెస్ట్‌ చేసిన వాటిల్లో చాలా వరకు వచ్చే ఏడాది 100 శాతానికి పైగా రాబడులు ఇస్తాయన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు. నాటకీయ పతనాల్లో భయంతో కంగారుపడి తీసుకునే నిర్ణయాలు తప్పు అని నిరూపితమైన గత ఉదాహరణలు గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలు, ట్రేడ్‌ వార్‌తో సంబంధం లేకుండా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇది మంచి సమయమని, ఈ చౌక ధరలు ఎక్కువ రోజుల పాటు ఉండవని తన ఇన్వెస్టర్లకు పొరింజు తెలియజేశారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పతనం

Monday 10th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం భారీ నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:44 సమయంలో 141 పాయింట్ల నష్టంతో 10,598 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,735 పాయింట్లతో పోలిస్తే 137 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ భారీ నష్టాల్లో

మ్యూచువల్‌ ఫండ్స్‌ సురక్షితమేనా?

Sunday 9th December 2018

దేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఎంతో చరిత్ర ఉంది. కానీ, గత కొన్నేళ్ల నుంచి వీటి పట్ల ఆదరణ పెరుగుతూ వస్తోంది. నేటి తరం యువత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ, ఇతర సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు తక్కువగా ఉండడం వంటి ఎన్నో అంశాలు ఇందుకు కారణమని చెప్పొచ్చు. మరి వీటిల్లో భదత్ర ఏ మేరకు? అన్న సందేహం చాలా మంది ఇన్వెస్టర్లను

Most from this category