STOCKS

News


పాలీక్యాబ్‌ లిస్టింగ్‌ మెరుపులు

Wednesday 17th April 2019
Markets_main1555480532.png-25178

-18 శాతం లాభంతో లిస్టింగ్‌ 
-22 శాతం లాభంతో ముగింపు

న్యూఢిల్లీ: వైర్లు, కేబుళ్లు తయారు చేసే పాలీక్యాబ్‌ ఇండియా కంపెనీ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. బీఎస్‌ఈలో పాలీక్యాబ్‌ ఇండియా షేర్‌ ఇష్యూ ధర, రూ.538తో పోల్చితే 18 శాతం లాభంతో రూ.633 వద్ద లిస్ట్‌ అయింది. ఇంట్రాడేలో 23 శాతం లాభంతో రూ.668ను వద్ద గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 22 శాతం లాభంతో రూ.655 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 22.42 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 2.29 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. మంగళవారం మార్కెట్‌ ముగిసే సమయానికి కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.9,736 కోట్లుగా నమోదైంది. ఇటీవలే రూ.533-538 ప్రైస్‌బాండ్‌తో ఐపీఓకు వచ్చిన ఈ  కంపెనీ రూ.1,345 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 52 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.



You may be interested

త్వరలో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ ఐపీఓ

Wednesday 17th April 2019

 ఇష్యూ సైజు రూ.4,500 కోట్లు  న్యూఢిల్లీ: స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ సోలార్‌, ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సమర్పించింది. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రమోట్‌​ చేస్తున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సంస్థ ఈ ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ చైర్మన్‌

మూడురోజుల్లో 68పైసలు డౌన్‌

Wednesday 17th April 2019

- మంగళవారం ముగింపు 69.60 ముంబై: ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం వరుసగా మూడవ ట్రేడింగ్‌ సెషన్‌లోనూ తగ్గింది. సోమవారం ముగింపు (69.42)తో పోల్చితే 18పైసలు తగ్గి 69.60 వద్ద ముగిసింది. మూడురోజుల్లో రూపాయి 68 పైసలు నష్టపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్‌, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల వంటి అంశాలు రూపాయిపై ఈ మూడురోజుల్లో ప్రభావం చూపాయి.  ఈ వారంలో రెండు రోజులు

Most from this category