STOCKS

News


భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..!

Monday 4th March 2019
Markets_main1551672076.png-24412

  • సోమవారం మార్కెట్‌కు సెలవు
  • మంగళవారం నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ వెల్లడి-
  • బుధవారం యూఎస్‌ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా-
  • యూఎస్‌ నాన్‌ ఫామ్ పేరోల్స్ గణాంకాలు ఈవారంలోనే..

ముంబై: భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను వాఘా సరిహద్దు దగ్గర పాక్‌ అప్పగించిన నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. పైలట్‌ను తిరిగి అప్పగించడంతో భారత్-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకు తగ్గి దాయాదుల మధ్య కమ్ముకున్న యుద్థ మేఘాలు సమసిపోయినట్లేనని మార్కెట్‌ వర్గాలు భావించాయి. ఈ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన కీలక వ్యాఖ్యలు కూడా మార్కెట్‌ను నిలబెట్టాయి. అణ్వాయుధ శక్తి కలిగిన ఇద్దరు దాయాదుల మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు త్వరలోనే సమసిపోయే అవకాశం ఉందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్నది ఉగ్రవాద శిబిరాలపై దాడులు తప్పించి.. ఇరు దేశాల మధ్య యుద్ధంకాదన్న స్పష్టతతో వారంతంనాడు మార్కెట్లు సానుకూల స్పందించినప్పటికీ, యుద్ధ భాయాలు మాత్రం ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబతున్నాయి. ఈ భయాలు మరింత పెరిగినా, యుద్ధ వాతావరణమే మరోసారి కనిపించినా రానున్నరోజుల్లో ఒక్కసారిగా భారీ పతనం ఉండేందుకు అవకాశం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. 

అంతర్జాతీయ అంశాలపై దృష్టి..
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ మధ్య భేటీ గురువారం ఎలాంటి సత్ఫలితం లేకుండానే ముగిసింది. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలన్నీ ఎత్తివేయాలని కిమ్‌ కోరగా ఇందుకు తాము అంగీకరించలేదని ట్రంప్‌ వెల్లడించారు. ఇక్కడి వాతావరణం అయోమయంగానే ఉన్నప్పటికీ.. మరోవైపు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోంది. ఇరు దేశాల తుది వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధికారులు సిద్ధంచేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ కథనం ప్రచురించింది. రెండు దేశాల చర్చల్లో అద్భుత పురోగతి ఉందని వైట్‌హౌస్‌ ఆర్థిక సలహాదారు లారీ కుడ్లో వ్యాఖ్యానించడం మార్కెట్‌కు సానుకూల అంశంగా ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ అంశాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మార్కెట్‌ వర్గాలు సూచిస్తున్నాయి.

మొదలైన ఎన్నికల వేడి..
సార్వత్రిక ఎన్నికలు అనుకున్న సమయానికే జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రధాన అధికారి సునీల్‌ ఆరోరా స్పష్టం చేసిన నేపథ్యంలో మార్కెట్లో ఎన్నికల వేడి మొదలుకానుందని యస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అమర్ అంబానీ అన్నారు. ఎన్నికల సమీపిస్తున్నందున సూచీల్లో ఒక భారీ పెరుగుదల ఉండనుందని అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. ఇక వచ్చే వారంలో షెడ్యూల్‌ విడుదలయ్యే అంచనాలు ఉన్న కారణంగా సూచీల్లో అధిక స్థాయి ఒడిదుడుకులకు అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 

గణాంకాలపై దృష్టి..
ఈఏడాది ఫిబ్రవరికి సంబంధించిన నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ మార్చి5న (మంగళవారం) వెల్లడికానుంది. డిసెంబర్‌ నెల యూఎస్‌ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా బుధవారం వెల్లడికానుండగా.. ఆదేశ జనవరి వాణిజ్య గణాంకాలు గురువారం రానున్నాయి. శుక్రవారం చైనా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ వెల్లడికానుండగా.. అదేరోజున యూఎస్‌ నాన్‌ ఫామ్ పేరోల్స్ గణాంకాలు విడుదలకానున్నాయి. ఇక ఇతర అంతర్జాతీయ ప్రధాన అంశాల్లో.. వడ్డీ రేట్లకు సంబంధించి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ) తన నిర్ణయాన్ని మార్చి 7న (గురువారం) ప్రకటించనుంది. 

ముడిచమురు ధరల ప్రభావం..
గతవారంలో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ 2 శాతం తగ్గాయి. అయితే, గతేడాది డిసెంబర్‌లో నమోదైన 50.5 డాలర్ల వద్ద నుంచి చూస్తే 15 శాతం పెరిగాయి. ఒపెక్‌ ఉత్పత్తి కోత కారణంగా ధరల్లో ఈస్థాయి పెరుగుదల నమోదైందని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ కమోడిటీ విశ్లేషకులు సకినా అన్నారు. 

15-నెలల గరిష్టస్థాయికి ఎఫ్‌ఐఐల పెట్టుబడి...
ఈఏడాది ఫిబ్రవరిలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.17,220 కోట్ల దేశీయ స్టాక్‌ మార్కెట్లో నికర పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడైంది. గతేడాది నవంబర్‌లో రూ.19,728 కోట్ల నికర పెట్టుబడి పెట్టిన వీరు.. ఆ తరువాత గతనెల్లోనే భారీ స్థాయిలో పెట్టుబడిపెట్టినట్లు వెల్లడైంది.



You may be interested

భారత్ సుంకాలపై ట్రంప్ గుర్రు..

Monday 4th March 2019

దీటుగా తామూ టారిఫ్‌లు పెంచాల్సి ఉంటుందని వ్యాఖ్యలు వాషింగ్టన్‌:  అమెరికన్ ఉత్పత్తులపై భారత్‌ భారీ సుంకాలు విధిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు."అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో" భారత్ కూడా ఒకటని, ప్రతిగా తాము కూడా భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై అదే స్థాయిలో సుంకాలు విధించాలని లేదా కనీసం "ఎంతో కొంత, ఏదో ఒక ట్యాక్స్" అయినా విధించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌

నేడు మార్కెట్లకు సెలవు

Monday 4th March 2019

మహాశివరాత్రి సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్‌ ఎక్చే‍్సంజీలకు సెలవు. అలాగే కమోడిటీ, బులియన్‌, మెటల్‌, ఫారెక్స్‌ మార్కెట్లకు సైతం నేడు పని చేయవు. అన్ని మార్కెట్లు తిరిగి మంగళవారం ప్రారంభవుతాయి. భారత్‌ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం మార్కెట్‌ మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ 196 పాయింట్లు పెరిగి 36, 064 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి

Most from this category