STOCKS

News


ఈ షేర్లన్నీ బేరిష్‌

Tuesday 22nd January 2019
Markets_main1548144759.png-23730

ఎంఏసీడీ నెగిటివ్‌ క్రాసోవర్‌
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లు బేరిష్‌
సోమవారం ముగింపు ప్రకారం 97 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, యూబీఐ, పీఎన్‌బీ, ఐడీఎఫ్‌సీ, యాడ్‌ల్యాబ్స్‌, జీఎంఆర్‌ఇన్‌ఫ్రా, ఆర్‌పవర్‌, ఆర్‌క్యాప్‌, డీఎల్‌ఎఫ్‌, ఆర్‌ఇన్‌ఫ్రా, యూపీఎల్‌, టొరెంట్‌ పవర్‌, టాటాగ్లోబల్‌, నాట్కో, ఎంసీఎక్స్‌, ఈఐడీ ప్యారీ, సుప్రీం ఇన్‌ఫ్రా, ఐనాక్స్‌ విండ్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 24 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. వీటిలో స్పార్క్‌, హిండాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ, ఒమెక్స్‌, ట్రెంట్‌, తిరుమలై కెమికల్స్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, టీటీకే ప్రెస్టేజ్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  
మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

ఫలితాల జోష్‌.... టీవీఎస్‌ మోటర్‌ ర్యాలీ

Tuesday 22nd January 2019

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(క్యూ3)లో అంచనాలకు మించి ఫలితాలను ప్రకటించంతో టీవీఎస్‌ మోటర్ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టింది. నేడు బీఎస్‌ఈలో టీవీఎస్‌ షేరు రూ.535.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు కంపెనీ ప్రకటించిన లాభదాయక క్యూ3 ఫలితాలతో షేరు డిమాండ్‌కు పెరిగింది. ఫలితంగా ఇంట్రాడేలో షేరు 4శాతం ర్యాలీ చేసి రూ.559.90ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గత ముగింపు ధర(రూ.538.05)

నష్టాల్లో అటో షేర్లు

Tuesday 22nd January 2019

నష్టాల మార్కెట్లో అటో షేర్లు మంగళవారం భారీగా క్షీణించాయి. మిడ్‌సెషన్‌ సమయానికి ఎన్‌ఎస్‌ఈలోని అటో ఇండెక్స్‌ 1.50శాతం పతనమైంది. ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌షేర్లైన మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతి షేర్ల క్షీణత ఇండెక్స్‌ పతనానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. మధ్యాహ్నం గం.1:00లకు అటో ఇండెక్స్‌ 1.30శాతం నష్టపోయి 8,628.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి అశోక్‌ లేలాండ్‌ అత్యధికంగా 3.50శాతం నష్టపోయింది. ఎం అండ్‌ ఎం 3శాతం, టాటామోటర్స్‌

Most from this category