STOCKS

News


పీఎన్‌బీ ఎన్‌పీఏల షాక్‌..!

Friday 2nd November 2018
Markets_main1541146777.png-21665

  • క్యూ2లో రూ.4532 కోట్లు నికర నష్టం

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) కష్టాలు ఇంకా తీరలేదు. పెరిగిన ఎన్‌పీఏలతో పీఎన్‌బీ ఈ క్యూ2లో రూ.4,532కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం ఈ త్రైమాసికంలో రూ.1,349.2 నికరనష్టాన్ని నమోదు చేయవచ్చని అంచనావేశారు.  గతేడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.560 కోట్ల నికర లాభాన్ని సాధించడం విశేషం. ఈ క్యూ2 కాలంలో ప్రోవిజన్స్‌ గణనీయంగా పెరిగాయి. గతేడాది ఇదే క్యూ2లో ప్రోవిజన్స్‌ రూ.2,440కోట్లుగా ఉండగా, ఈ క్యూ2లో రూ.9,757 కోట్లుకు ఎగిశాయి. గతేడాది క్యూ2లో రూ.2,964 కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తులు ఈ క్యూ2లో రూ.7,733 కోట్లకు పెరిగాయి. సంవత్సరం ప్రాతిపదికన స్థూల ఎన్‌పీలు 13.31శాతం నుంచి 17.16 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఎలు సైతం 8.44 శాతం నుంచి 8.9శాతానికి ఎగిశాయి. ‘‘ఆర్‌బీఐ సూచనల ప్రకారం త్రైమాసిక ఫలితాల్లో నిరర్థక ఆస్తులు, పునర్వ్యవస్థీకరించబడిన అడ్వాన్సులు, పెట్టుబడి తరుగుదల తదితర ప్రామాణిక అంశాలు పరిగణలోకి తీసుకోవడంతో నష్టాలు పెరిగినట్లు కంపెనీ అధికారులు తెలిపారు.
 నష్టాల్లో షేరు ధర:-
త్రైమాసిక ఫలితాల అనంతరం షేరు నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. విశ్లేషకుల అంచనాలను మించి నష్టాలను నమోదు కావడంతో బీఎస్‌ఈలో మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.74.25)తో పోలిస్తే దాదాపు 3.50శాతం నష్టంతో రూ.71.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట గరిష్ట, ధరలు వరుసగా రూ. 58.65 రూ.211.95లుగా నమోదయ్యాయి.


PNB

You may be interested

దాల్మియా భారత్ టార్గెట్‌ రూ.3,100

Friday 2nd November 2018

కంపెనీ: దాల్మియా భారత్ లిమిటెడ్‌ సిఫార్సు: సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ ప్రస్తుత ధర: రూ.2,212 (నవంబర్‌ 2, 2018న) టార్గెట్‌ ధర: రూ.3,100 రెకమండేషన్‌: కొనొచ్చు 52 వారాల గరిష్ట, కనిష్ట ధర రూ.3,350 /1,930 దాల్మియా భారత్ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసిక(క్యూ2) ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ఈ కంపెనీ షేరుకు బై రేటింగ్‌ ఇచ్చినట్లు సెంట్రమ్‌ వెల్లడించింది. సెంట్రమ్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ రూపొందించిన రీసెర్చ్‌ రిపోర్ట్‌ను కింద

26 రెట్లు పెరిగిన డీఎల్‌ఎఫ్‌ లాభం

Friday 2nd November 2018

రియల్టీ దిగ్గజం డీఎల్‌ఎఫ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 26 రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.14 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.375 కోట్లకు పెరిగిందని డీఎల్‌ఎఫ్‌ తెలిపింది. అనుబంధ కంపెనీల, జాయింట్‌ వెంచర్ల కార్యకలాపాల ద్వారా రూ.239 కోట్ల లాభం వచ్చిందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.1,751 కోట్ల నుంచి రూ.2,305 కోట్లకు పెరిగిందని పేర్కొంది. గుర్గావ్‌లో కమర్షియల్‌ ప్రాజెక్ట్‌

Most from this category