News


ఫలితాలతో పీఎన్‌బీ కౌంటర్లో ఒడుదుడుకులు

Tuesday 5th February 2019
Markets_main1549355608.png-24025

  • తొలుత ర్యాలీ...అటుపై అమ్మకాలు

ప్రభుత్వరంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ3లో బ్యాంక్‌ రూ.246.51 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ3లో సాధించిన రూ.230.11 కోట్లతో పోలిస్తే ఇది 7శాతం అధికం. అలాగే గత రెండు క్వార్టర్లలో (క్యూ1, క్యూ2)  నికర నష్టాల్ని చవిచూసిన బ్యాంక్‌, తాజా క్వార్టర్లో లాభాన్నిఆర్జించడం విశేషం. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 8శాతం వృద్ధిని సాధించింది. గత క్యూ3లో బ్యాంక్‌ ఎన్‌ఐఐలు రూ.3,989 కోట్ల నమోదవ్వగా, ఈ క్యూ3లో రూ.4,290 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది(2017-18) క్యూ3లో మొండిబకాయిలకు రూ.4467 కోట్ల ప్రోవిజన్లను కేటాయించగా, ఈ క్యూ3లో రూ. 2754 కోట్ల ప్రొవిజన్లను కేటాయించింది. త్రైమాసిక ప్రాతిపాదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 17.16 శాతం నుంచి 16.33 శాతానికి, నికర మొండిబకాయిలు 8.9 శాతం నుంచి 8.22 శాతానికి తగ్గాయి. ఐబీసీ ఖాతాలనుంచి రూ. 163 కోట్ల ప్రొవిజన్లను రైట్‌బ్యాక్‌ చేపట్టింది.
గరిష్టస్థాయిలో అమ్మకాలు
నేడు బీఎస్‌ఈలో పీఎన్‌బీ షేరు రూ.73.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మెరుగైన క్యూ3 ఫలితాల ప్రకటనతో షేరు నేటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో 5శాతం ర్యాలీ చేసి రూ.76.50ల గరిష్టానికి తాకింది. అటుతర్వాత అమ్మకాలు వెల్లువెత్తడంతో రూ. 72 వద్దకు క్షీణించింది. చివరకు స్వల్పలాభంతో రూ. 73.30 వద్ద ముగిసింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.
58.65 రూ.166.00లుగా నమోదయ్యాయి.


PNB

You may be interested

స్వల్ప లాభంతో ముగింపు

Tuesday 5th February 2019

నేటి నుంచి ప్రారంభమైన ఆర్‌బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాలతో పాటు ప్రధాన కంపెనీల క్యూ3 పలితాల ప్రకటన నేపధ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కారణంగా మార్కెట్‌ మంగళవారం  స్వల్పలాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 34 పాయింట్ల లాభంతో 36,617 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ 22 పాయింట్లు పెరిగి 10,934 పాయింట్ల వద్ద ముగిసింది. సూచీలు లాభాలతో ముగియడం వరుసగా ఇది నాలుగో రోజు. అటో, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లలో

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం ర్యాలీ

Tuesday 5th February 2019

ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో మంగళవారం ఈ రంగానికి చెందిన షేర్లు లాభాల బాటపట్టాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు ఎక్కువగా జరిగాయి. నేటి క్యూ3 గణాంకాల విడుదల నేపథ్యంలో పంజాజ్‌నేషనల్‌బ్యాంక్‌ 5శాతం ర్యాలీ చేసింది. జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌ షేరు 3శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌ 1శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ ఓరియంటల్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ షేర్లు అరశాతం ర్యాలీ చేశాయి. మరోవైపు ఈ క్యూ3లో ఆశించిన

Most from this category