STOCKS

News


పీఎంఎస్‌లకూ నష్టాల సెగ

Friday 8th February 2019
Markets_main1549649599.png-24097

ప్రముఖ బ్రోకరేజీ సంస్థలు, ఏఎంసీలు నిర్వహించే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసులు (పీఎంఎస్‌) సైతం జనవరి నెలలో నష్టాలను ఎదుర్కొన్నాయి. పెద్ద ఇన్వె‍స్టర్లకు ఈ సంస్థలు ఈక్విటీ పెట్టుబడి సేవలను అందిస్తుంటాయి. ఇన్వెస్టర్ల తరఫున నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడి వ్యవహారాలు చూసే పీఎంఎస్‌లు సైతం గత నెలలో మార్కెట్ల అస్థిరతల ప్రభావానికి లోనైనట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. పేరున్న పీఎంఎస్‌ సంస్థల నిర్వహణలోని పెట్టుబడుల విలువ 10 శాతం క్షీణించడం అస్థిరతల్లో ఇన్వెస్టర్లకు రాబడుల ఇచ్చే విషయంలో వాటి సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది.  

 

నష్టాల పీఎంఎస్‌లు
జనవరిలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ అరశాతం మేర పెరిగితే, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 5.69 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీలు 5.31 శాతం మేర క్షీణించాయి. ఇదే పీఎంఎస్‌ విలువలు దెబ్బతినడానికి కారణంగా తెలుస్తోంది. సెబీ వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... కోల్‌కతాకు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్‌ బసంత్‌ మహేశ్వరి నిర్వహించే బసంత్‌ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్‌ పీఎంఎస్‌ ఫండ్‌ విలువ జనవరిలో 9.85 శాతం పడిపోయింది. ఇదే ఫండ్‌ డిసెంబర్‌ మాసంలో 6.72 శాతం వృద్ధి చూపించింది. 170 మంది ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.177 కోట్ల పెట్టుబడులను బసంత్‌ మహేశ్వరి ఫండ్‌ నిర్వహిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ఫండ్‌ విలువ 21.50 శాతం పడిపోవడం గమనార్హం. ఇక అందరికీ తెలిసిన పొరింజు వెలియాత్‌ నిర్వహణలోని ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా ఫండ్‌ విలువ జనవరిలో 8 శాతం పడిపోయింది. గత డిసెంబర్‌లో 2 శాతం పెరగ్గా, అంతకుముందు రెండు నెలల్లో 5 శాతానికి పైగా క్షీణించింది. లయడ్‌ ఎలక్ట్రికల్‌ (లీల్‌)లో పెట్టుబడి పెట్టి పెద్ద తప్పిదం చేశానని వెలియాత్‌ ఇటీవలే ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. 

 

ఇక పెట్టుబడుల విలువ క్షీణించిన ఇతర పీఎంఎస్‌లలో... తులసియాన్‌ పీఎంఎస్‌ 7.39 శాతం, ఇండియానివేష్‌ ఇవ్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ 7.22 శాతం, ఈక్విరస్‌ సెక్యూరిటీస్‌ 6.38 శాతం, ఆదిత్య బిర్లా మనీ 5.9 శాతం, ఆల్కెమీ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ 5.87 శాతం, ఏసీ చోక్సి షేర్‌ బ్రోకర్స్‌ 5.39 శాతం, స్టీవార్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ 5.26 శాతం, సాగే వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ 5.25 శాతం, షేర్‌ఖాన్‌ 4.99 శాతం, సంవితి క్యాపిటల్‌ 4.94 శాతం, వన్‌ థర్టీ క్యాపిటల్‌ 4.77 శాతం, ఏఎస్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ 4.76 శాతం, నలంద సెక్యూరిటీస్‌ 4.67 శాతం, మునోత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 4.56 శాతం, ఎంకే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ 4.48 శాతం చొప్పున పెట్టుబడుల విలువను కోల్పోయాయి. ఇక మూడు శాతం నుంచి 5 శాతం లోపు క్షీణించిన ఇతర పీఎంఎస్‌లలో... మోతీలాల్‌ ఓస్వాల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, రిలయన్స్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ట్రస్ట్‌లైన్‌ హోల్డింగ్స్‌, ఇన్వెస్కో అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, యాక్సిస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, ఐడీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, అవెండస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌,  కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌, జేఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌, జెన్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌, ఇనాం అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, జియోజిత్‌ ఫైనాన్షియల్‌, బిర్లా సన్‌లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, యాంబిట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఉన్నాయి. 

 

లాభాలు పంచినవి
దాదాపు అన్ని పీఎంఎస్‌లు జనవరిలో ఇన్వెస్టర్లకు నష్టాలు పంచితే... ఎడారిలో ఓయాసిస్‌ మాదిరిగా కేవలం కొన్ని లాభాలను కూడా ఇచ్చాయి. ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ సర్వీసెస్‌ 8.5 శాతం, ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ 8.39 శాతం, ఇండియాబుల్స్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ 2.86 శాతం, కార్వీ క్యాపిటల్‌ ఒక శాతం వరకు రాబడులను ఇచ్చాయి. 



You may be interested

మెజెస్కో షేరును కొనవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ

Saturday 9th February 2019

ఐటీ రంగంలో సేవలను అందించే మెజెస్కో షేరును కొనవచ్చని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీ సిఫార్సు చేస్తోంది. ఐటీ సెక్టార్‌లో అధిక డిమాండ్‌ కలిగిన క్లౌడ్‌ సర్వీసులకు ప్రాధాన్యమిస్తున్నందున భవిష్యత్తులో కంపెనీ రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది. స్థిర వ్యయాలు, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత తదితర కారణాలు కంపెనీ మార్జిన్లు పెంచవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ చెబుతోంది. మెజెస్కో షేరుపై హెచ్‌డీఎఫ్‌సీ సమగ్ర విశ్లేషణ

బెన్‌గ్రాహమ్‌ ఫిల్టర్స్‌ను సరితూగే నాలుగు స్టాక్స్‌?

Friday 8th February 2019

వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ పితామహుడే బెన్‌ గ్రాహమ్‌. వారెన్‌ బఫెట్‌కు మార్గదర్శకుడు. ఓ కంపెనీ తన ఆస్తుల విలువ కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతుంటే ఆ కంపెనీ షేరులో ఇన్వెస్ట్‌ చేయడం బెన్‌ గ్రాహమ్‌ అనుసరించే విధానం. మనదేశ స్టాక్స్‌ గత ఏడాది కాలంలో గణనీయంగా దిద్దుబాటుకు గురయ్యాయి. మరి వాటిల్లో బెన్‌ గ్రాహమ్‌ చూసే కొలమానాలకు సరితూగేవి ఏమున్నాయో? గమనిస్తే...    ఓ కంపెనీ అంతర్గత విలువ (ఇంట్రిన్సిక్‌ వ్యాల్యూ) ఆ కంపెనీ

Most from this category