STOCKS

News


టాప్‌ పీఎంఎస్‌లకూ తప్పలేదు నష్టాలు

Friday 12th October 2018
Markets_main1539282950.png-21057

పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సేవలు అందించే ప్రముఖ సంస్థలకు సైతం తాజా మార్కెట్‌ పతనం నష్టాలను మిగిల్చింది. సాధారణంగా మార్కెట్‌ కరెక్షన్లలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు మాత్రమే నష్టాలు వస్తాయని అనుకోవడం పొరపాటే అవుతుంది. ఇందుకు ఈ గణాంకాలే నిదర్శనం. అనుభవమున్న ఇన్వెస్టర్లు, పెట్టుబడి సంస్థలూ నష్టపోయిననట్టు గత నెలకు సంబంధించి సెబీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 6.25 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 12.54 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 16 శాతం చొప్పున సెప్టెంబర్‌లో నష్టపోయాయి. కానీ, కోచికి చెందిన ప్రముఖ ఇన్వెస్టర్‌, పొరింజు వెలియాత్‌కు చెందిన ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ పీఎంఎస్‌ పోర్ట్‌ఫోలియో విలువ సెప్టెంబర్‌లో 20 శాతం నష్టపోయింది. ఇదే పీఎంఎస్‌ జూలైలో 3.70 శాతం, ఆగస్ట్‌లో 6.33 శాతం చొప్పున రాబడులను ఇచ్చింది. ఈ తరహా పరిస్థితులను ఇన్వెస్టర్లు మర్చిపోరాదని, కరెక్షన్లు, పతనాలు గతంలోనూ వచ్చినవేనని, ఆ తర్వాత ప్రతీసారి మార్కెట్లు పెరిగాయని పొరింజు వెలియాత్‌ పేర్కొన్నారు. ప్రతీ సైకిల్‌ ఇన్వెస్టర్లు నేర్చుకునేందుకు అవకాశంగా పేర్కొన్నారు.

 

బసంత్‌ మహేశ్వరి వెల్త్‌ అడ్వైజర్స్‌ పీఎంఎస్‌ విలువ సెప్టెంబర్‌లో 21.50 శాతం క్షీణించింది. ఈ పీఎంఎస్‌ను బసంత్‌ మహేశ్వరి నిర్వహిస్తుంటారు. జూలైలో 15.90 శాతం, ఆగస్ట్‌లో 2.40 శాతం రాబడులను మాత్రం అందించారు. ఇక మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ నిర్వహించే పీఎంఎస్‌ విలువ సైతం 12 శాతం పతనమైంది. కాకపోతే సాంకేతిక లోపాల వల్ల సెబీ వెబ్‌సైట్‌లో 12 శాతం పాజిటివ్‌ రాబడులను చూపిస్తున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఈనామ్ ఏఎంసీ, ఆస్క్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌, కోటక్‌ మహింద్రా ఏఎంసీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ, ఓల్డ్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌, సుందరం అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ, రిలయన్స్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, 2పాయింట్‌2 క్యాపిటల్‌ అడ్వైజర్స్‌, వ్యాల్యూక్వెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ పీఎంఎస్‌ పెట్టుబడుల విలువ 10-17 శాతం మధ్యలో సెప్టెంబర్‌లో పడిపోయింది. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌..

Friday 12th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:43 సమయంలో 56 పాయింట్ల లాభంతో 10,335 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,252 పాయింట్లతో పోలిస్తే 83 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగా

మార్కెట్లు పడినా... సిప్‌ పెట్టుబడుల హోరు

Friday 12th October 2018

గత రెండేళ్లుగా సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చే పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మార్కెట్లలో మంచి ర్యాలీ ఒక విధంగా సానుకూలతను ఇచ్చింది. అదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌పై అవగాహన కార్యక్రమాల పాత్ర కూడా ఉంది. కానీ, గత నెలన్నర రోజుల్లో మార్కెట్లు భారీ కరెక్షన్‌ను చవిచూసిన విషయం తెలిసింది. ఆగస్ట్‌ 29 తర్వాత మొదలైన కరెక్షన్‌ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ మ్యూచువల్‌

Most from this category