News


ఫార్మా స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారా...? ఒక్క నిమిషం!

Friday 21st December 2018
Markets_main1545331843.png-23115

ఫార్మా రంగ స్టాక్స్‌ చాలా తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతున్నాయి. గడిచిన మూడేళ్లుగా ఈ స్టాక్స్‌ బేరిష్‌గానే ఉన్నాయి. యూఎస్‌ఎఫ్‌డీఏ కఠినంగా వ్యవహరించడం, తనిఖీలు, అభ్యంతరాల పేరుతో భారత ఫార్మా కంపెనీలను బెంబేలెత్తించింది. అమెరికా మార్కెట్లో జనరిక్స్‌ ఔషధ ధరల పోటీ పరాకాష్టకు చేరుకుంది. అయితే, గత కొంత కాలంగా ఈ పరిస్థితులు కాస్త ఉపశమించాయి. అదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం... అమెరికా మార్కెట్లలో ఎక్కువ టర్నోవర్‌ ఉన్న దేశీయ ఫార్మా కంపెనీలు అరబిందో, డాక్టర్‌ రెడ్డీస్‌ తదితర స్టాక్స్‌ పట్ల ఆసక్తికి దారితీసింది. తక్కువ ధరల్లో ఉన్నాయి కదా అని ముందడుగు వేసే ముందు విశ్లేషకులు ఏమంటున్నారో చూద్దాం ఓ సారి...

 

మన ఫార్మా కంపెనీల ఫండమెంటల్స్‌ బలంగానే ఉన్నాయి. కానీ, పరిస్థితులే ఆశాజనకంగా మారినట్టు లేదు. ప్రజావేగులు ఇచ్చిన ఫి‍ర్యాదుల ఆధారంగా సన్‌ఫార్మా కంపెనీపై యూఎస్‌ఎఫ్‌డీఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఈ స్టాక్‌ జోలికి పోకపోవడమే మంచిదన్నది మార్కెట్‌ వర్గాల అభిప్రాయం. మరి ఈ రంగంలో ఆకర్షణీయంగా ఉన్నవి ఏమిటి? అని ప్రశ్నించొచ్చు. అరబిందో ఫార్మా, టోరెంట్‌ ఫార్మా, క్యాడిలా హెల్త్‌కేర్‌ కంపెనీలు ఆకర్షణీయంగానే ఉన్నా, వీటి విషయంలోనూ ఇన్వెస్టర్లు గమనించాల్సిన అంశాలు ఉన్నాయి. అరబిందో ఫార్మా ఇటీవలి కాలంలో కొనుగోళ్లు, వ్యాపార విస్తరణ పరంగా దూకుడు మీద ఉంది. నోవార్టిస్‌ జనరిక్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. చైనా మార్కెట్లోకి అడుగుపెట్టింది. అక్కడి ఓ కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. గత నాలుగు త్రైమాసికాల్లో ఆదాయాల పరంగా చూసుకుంటే అరబిందో స్టాక్‌ 20 పీఈ వద్ద ట్రేడవుతోంది. అయితే, క్లాస్‌ యాక్షన్‌ సూట్స్‌, అనుకున్న విధంగా కొనుగోళ్లు కలసి రాకపోవడం, అమెరికా మార్కెట్లో సవాళ్లు ఈ కంపెనీకి ఉన్న రిస్క్‌లు. 87 శాతం మంది విశ్లేషకులు ఈ స్టాక్‌కు బై రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. 

 

సన్‌ ఫార్మాతో పోలిస్తే టోరెంట్‌ ఫార్మా అధిక వ్యాల్యూషన్ల వద్ద ట్రేడవుతోంది. ఇది కూడా ఆకర్షణీయంగానే ఉంది. యునికెమ్‌ ల్యాబ్స్‌ దేశీయ వ్యాపారాన్ని ఈ సంస్థ గతంలో సొంతం చేసుకుంది. అమెరికా, బ్రెజిల్‌ మార్కెట్లలో వ్యాపార వృద్ధి ఉంది. అమెరికా మార్కెట్‌ రూపురేఖలు మారిపోవడం, కొనుగోలుకు సంబంధించిన అంశాలు, భవిష్యత్తులో నియంత్రణపరమైన పరిశీలనలు ఉన్న రిస్క్‌లు. ఇక క్యాడిలా హెల్త్‌కేర్‌ను పరిశీలిస్తే.. ఉత్పత్తుల పరంగా బలమైన పైపులైన్‌, అమెరికా మార్కెట్లో కొనుగోలు, బయలాజిక్స్‌ వ్యాక్సిన్లలోకి ప్రవేశించడం ఈ కంపెనీకి ఉన్న వృద్ధి అవకాశాలు. తన సబ్సిడరీ కంపెనీ జైడస్‌ వెల్‌నెస్‌ హీంజ్‌ ఇండియా బ్రాండ్లు కాంప్లాన్‌, గ్లూకాన్‌ డి, నైసిల్‌ కొనుగోలుకు అవసరమైన నిధుల సహకారాన్ని అందించాల్సి ఉంది. ఇది బ్యాలన్స్‌ షీటుపై ప్రభావం చూపిస్తుందని అంచనా. అయితే, 70 శాతం మంది విశ్లేషకులు టోరెంట్‌, క్యాడిలా కొనుగోలుకు సిఫారసు చేశారు. మొత్తం మీద చూస్తే... ఫార్మా కంపెనీలు ధరల క్షీణత, వివాదాలు, పోటీ, యూఎస్‌ఎఫ్‌డీఏ పరిశీలన పెరగడం, దేశీయంగా ధరల నియంత్రణ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పోటీ పరిమితంగా ఉన్న విభాగాల్లో పెట్టుబడులను అధికం చేయడం, కొనుగోళ్లు వంటి వ్యూహాలతో కంపెనీలు ముందుకు వెళుతున్నాయి.

 

సన్‌ ఫార్మా స్టాక్‌ 34.55 పీఈ వద్ద ట్రేడ్‌ అవుతుంటే, ఈ స్టాక్‌కు 44 శాతం అనలిస్టులు బై రేటింగ్‌ ఇచ్చారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ 27 పీఈ వద్ద ఉండగా, 49 శాతం అనలిస్టులు కొనుగోలుకు సిఫారసు చేసి ఉన్నారు. బయోకాన్‌ 55 పీఈ వద్ద ట్రేడ్‌ అవుతుంటే 60 శాతం అనలిస్టులు కొనుగోలుకు రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. సిప్లా 31 పీఈ వద్ద ఉండగా, 47 శాతం విశ్లేషకులు బైరేటింగ్‌ ఇచ్చారు. You may be interested

ఐవోసీపై విశ్లేషకుల మనోగతం

Friday 21st December 2018

ప్రభుత్వరంగంలోని చుమరు ఉత్పత్తుల రిటైలింగ్‌ కంపెనీ ‘ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌’ (ఐవోసీ) బైబ్యాక్‌ ఆఫర్‌తో ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది. ఒక్కో షేరు కొనుగోలు ధర రూ.149. 3.06 శాతానికి సమానమైన 29.76 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. మరి రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈ ఆఫర్‌లో పాల్గొనొచ్చా? లేక తమ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు అట్టే పెట్టుకోవాలా? ఈ సందేహాలకు విశ్లేషకుల అభిప్రాయాలే సమాధానాలు.   షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌తోపాటు ఒక్కో షేరుకు రూ.6.75ను మధ్యంతర

ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్‌

Thursday 20th December 2018

ఫెడ్‌రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్‌ ఏడురోజుల సుధీర్ఘర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ప్రభుత్వ రంగ బ్యాంక్‌, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల పతనంతో సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 52 పాయింట్ల నష్టంతో 36,432 వద్ద, నిఫ్టీ 15 పాయింట్ల నష్టంతో 10,951 వద్ద ముగిసింది. ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటు పెంపుతో అమెరికా, ఆసియా మార్కెట్ల నష్టాల ట్రేడింగ్‌ సంకేతాలను అందుకున్న సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి.

Most from this category