ఎన్సీడీల జారీకి సిద్ధమైన పిరమల్ ఎంటర్ప్రైజెస్
By Sakshi

ముంబై: నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు (ఎన్సీడీ)ను జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లను సమీకరించనున్నట్లు పిరమల్ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ పద్దతిలో ఈ మొత్తాన్ని సమీకరించేందుకు బోర్డులోని పరిపాలనా కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. తొలుత రూ.400 కోట్లను, ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన పక్షంలో మరో రూ.100 కోట్లను కలిపి మొత్తంగా రూ.500 కోట్ల ఇష్యూ సైజ్‌కు బోర్డు నిర్ణయించిందని సంస్థ బీఎస్ఈ ఫైలింగ్ ద్వారా వెల్లడించింది. ఈ ఎన్సీడీలు ఎన్ఎస్ఈ హోల్‌సేల్ డెట్ మార్కెట్ విభాగంలో లిస్టింగ్‌కు రానున్నట్లు వివరించింది. కంపెనీ షేరు ధర బుధవారం రెండున్నర శాతం లాభపడి రూ.2,105 వద్ద ముగిసింది.
You may be interested
ప్రతి 5 కంపెనీలలో 2 క్రియారహితం..
Wednesday 28th November 2018రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్ఓసీ)లో నమోదైన కంపెనీలలో ఏకంగా 6.94 లక్షల సంస్థలు ఇన్‌యాక్టీవ్ (క్రియారహితం)గా ఉన్నట్లు తేలింది. ఈ ఏడాది అక్టోబరు 31నాటికి దేశంలో 18.10 లక్షల కంపెనీలు ఆర్‌ఓసీలో నమోదు కాగా.. వీటిలో కేవలం 11.16 లక్షల కంపెనీలు మాత్రమే సవ్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వ సమాచారం ద్వారా వెల్లడైంది. అంటే ప్రతి 5 కంపెనీలలో 3 మాత్రమే వ్యాపారం కొనసాగిస్తుండగా.. 2 కంపెనీలు క్రియారహితం ఉన్నట్లు లెక్క
డాలర్ బాండ్ మార్కెట్లో యస్ బ్యాంక్ భారీ పతనం
Wednesday 28th November 2018హాంగ్ కాంగ్లో 3.3 సెంట్లు తగ్గి 88.2 సెంట్లకు పతనం ఈ ఏడాదిలో 5.2 శాతం తగ్గుదల భవిష్యత్ నిధుల సమీకరణ ఇబ్బందిగా మారే అవకాశం యస్ బ్యాంక్ జారీ చేసినటువంటి డాలర్ బాండ్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. ప్రైవేట్ రంగానికి చెందిన ఈ బ్యాంక్ క్రెడిట్ రేటింగ్‌ను ‘జంక్’ రేటింగ్‌కు కుదించినట్లు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించిన నేపథ్యంలో బాండ్ విలువ రికార్డు స్థాయి కనిష్టానికి కుంగిపోయింది. ఈ రేటింగ్ సంస్థ పర్యవేక్షిస్తున్న