STOCKS

News


స్వల్పకాలానికి 3 ట్రేడింగ్‌ ఐడియాలు..!

Saturday 1st December 2018
Markets_main1543661524.png-22573

ముంబై: టెక్నికల్‌గా నిఫ్టీ 11,100 పాయిం‍ట్లకు సమీపాన ఉందని, వచ్చే రెండు రోజుల్లో ఈ దశలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని స్వతంత్ర మార్కెట్‌ అనలిస్ట్‌ కునాల్‌ బోత్ర అన్నారు. ముడిచమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో సూచీలకు నూతన ఉత్సాహం వచ్చిందని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. యస్‌ బ్యాంక్‌ బోటమ్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు ఉందని విశ్లేషించిన ఆయన డీఎల్‌ఎఫ్‌. రెప్కో హోమ్స్‌లో ఆకర్షణీయ కదలికలు నమోదు కాగా.. ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. ఈ వారానికి 3 షేర్లను సిఫార్సుచేశారు.

  • మైండ్‌ట్రీ: నవంబర్‌లో దాదాపుగా సైడ్‌వేస్‌లోనే ఉన్న ఈ షేరు.. గడిచిన రెండు రోజుల్లో కదలికలను నమోదుచేసింది. ఇంతకుముందు హైకి చేరువయ్యింది. ఈ షేరు టార్గెట్‌ ధర రూ.950, స్టాప్‌లాస్‌ రూ.850
  • స్ట్రైడ్స్ షాసున్: గతవారం రెండో అర్థభాగంలో దాదాపుగా అన్ని ఫార్మా షేర్లలోనూ రికవరీ నమోదైంది. బుల్లిష్‌ ఫ్లాగ్‌ ఏర్పాటుచేసిన ఈ షేరు టార్గెట్‌ ధర రూ.525, స్టాప్‌లాస్‌ రూ.460. 
  • ఎస్కార్ట్స్‌: డైలీ చార్టులో బ్రేకవుట్‌ సాధించిన ఈ షేరుకు టార్గెట్‌ ధర రూ.750, స్టాప్‌లాస్‌ రూ.680 వద్ద నిర్ణయించినట్లు తెలిపారు.


 You may be interested

ఈ స్టాక్స్‌పై సానుకూలత: మోతీలాల్‌ ఓస్వాల్‌

Sunday 2nd December 2018

నిఫ్టీ తన డౌన్‌లెగ్‌లో 10,880 సమీపంలో 50 శాతం రీట్రేస్‌మెంట్‌ను పూర్తి చేసిందని, ఇక కీలకమైన 11,000 మార్కును చేరుకోవాలంటే 10,777-10,800పైన నిలదొక్కుకోవాల్సి ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చందన్‌ తపారియా తెలిపారు. దిగువ వైపు 10,650 వద్ద కీలక మద్దతుగా నిలుస్తుందన్నారు. ‘‘నిఫ్టీ నవంబర్‌ సిరీస్‌లో 734 పాయింట్ల మేర లేదా 7.25 శాతం పెరిగింది. 2016 మార్చి తర్వాత చూస్తే ఒక

బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె సైరన్‌!!

Saturday 1st December 2018

బ్యాంక్‌ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, దేనా బ్యాంక్‌, విజయ బ్యాంక్‌ విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 26న దేశవ్యాప్తంగా సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్లు తాజాగా హెచ్చరించాయి. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లోనే ఈ మూడు ‍ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేయాలని నిర్ణయించుకుంది. అలాగే ఆయా బ్యాంకులు బోర్డులు కూడా విలీనానికి అంగీకారం తెలిపాయి.  యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) ఈ సమ్మెకు నేతృత్వం వహించనుంది. కేంద్ర

Most from this category