STOCKS

News


ధర కాదు.. వ్యాల్యుయేషన్‌ చూడాలి..

Thursday 27th September 2018
Markets_main1538041500.png-20647

ధర ప్రాతిపదికన కాకుండా వ్యాల్యుయేషన్స్‌ ఆధారంగా స్టాక్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు బోఫా-మెరిల్‌లించ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ మూకిన్‌. స్టాక్‌ కొనుగోలుకు ఎంత చెల్లిస్తున్నామనే దాన్ని వ్యాల్యుయేషన్స్‌ కోణంలో చూడాల్సి ఉందన్నారు. ఐటీ రంగం రక్షణాత్మక స్థానంలో ఉందని, అయితే ఇందులో వృద్ధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. కంపెనీల ఎర్నింగ్స్‌ వృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
ఈల్డ్స్‌ పెరుగుదల, డిఫాల్ట్‌ భయాలు అనే రెండు అంశాలు ఇప్పుడు ఆందోళనలకు కేంద్రంగా ఉన్నాయని సంజయ్‌ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీల మార్జిన్లు, వృద్ధి సామర్థ్యాలు, పీఈ వంటి అంశాల్లో ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. స్టాక్స్‌ను ధర ప్రకారం కాకుండా వ్యాల్యుయేషన్స్‌ ఆధారంగా కొనుగోలు చేయాలని సూచించారు. స్టాక్‌ 20 శాతం పతనమైందని కొనొద్దని సూచించారు. స్వల్పకాల, దీర్ఘకాల వృద్ధి అంచనాలు, వ్యాల్యుయేషన్స్‌ లెక్కింపు ఆధారంగా కొనుగోలు చేయాలని తెలిపారు. అది ఎన్‌బీఎఫ్‌సీ లేదా కన్సూమర్‌ స్టాక్‌ కావొచ్చని పేర్కొన్నారు. 
మార్కెట్‌ డౌన్‌ట్రెండ్‌ కొనసాగవచ్చని సంజయ్‌ అంచనా వేశారు. ఇందుకు చాలా అంశాలు కారణంగా ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా పరిస్థితులు మారుతున్నాయని, గ్లోబల్‌ లిక్విడిటీ తగ్గుతోందన్నారు. దేశీయంగా అస్థిరత పెరుగుతోందని తెలిపారు. ఎన్నికల వస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి వల్ల సెంటిమెంట్‌ దెబ్బతింటుందని తెలిపారు. ఐటీ స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సూచించారు. ఇవి రక్షణాత్మక స్టాక్స్‌ అని తెలిపారు. రూపాయి బలహీనత కారణంగా చాలా మంది ఐటీ స్టాక్స్‌కు ప్రాధాన్యమిస్తున్నారని, అయితే ప్రస్తుతం రూపాయి స్థిరపడుతోందని పేర్కొన్నారు. అందువల్ల ఐటీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి తక్కువ కారణాలు ఉన్నాయని తెలిపారు. 
గ్లోబల్‌గా లిక్విడిటీ తగ్గుతోందని, ఇలాంటి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సంజయ్‌ హెచ్చరించారు. అన్ని సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయని, తద్వారా గ్లోబల్‌గా లిక్విడిటీ తగ్గుతోందని, డాలర్‌ బలపడుతుందని వివరించారు. వర్ధమాన మార్కెట్లకు బలమైన డాలర్‌ ప్రమాదమని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల కూడా ప్రతికూలమని తెలిపారు. 
 



You may be interested

11,000ల దిగువకు నిఫ్టీ

Thursday 27th September 2018

మార్కెట్‌ పతనం ఆగట్లేదు. సెప్టెంబర్‌ నెల డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు చివరి తేది కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత, ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి మళ్లీ క్షీణించడం, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ప్రభావం, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ తదితర అంశాలు మార్కెట్‌ నష్టాలకు కారణమయ్యాయి. ఫార్మా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ మెటల్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలతోనే ముగిశాయి. ఫలితంగా నిఫ్టీ

దిగుమతి సుంకాల ఎఫెక్ట్‌: నష్టాల్లో కన్జ్యూమర్‌ షేర్లు

Thursday 27th September 2018

ముంబై:- దిగుమతి సుంకాల పెంపుతో కన్జ్యూమర్‌ షేర్లకు కష్టాలు మొదలయ్యాయి. సుంకాల పెంపుతో రానున్న రోజుల్లో మార్జిన్లు తగ్గితాయని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన దిగుమతుల సుంకాలతో రూపాయి విలువ క్షీణించినప్పటికీ, దిగుమతులు భారీ తగ్గే అవకాశం ఉంది. వినిమయ వస్తువులపై పెంచిన దిగుమతి సుంకాల ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చు. విద్యుత్‌ ఉపకరణాల దిగుమతులపై ప్రస్తుతం ఉన్న 10శాతం సుంకాన్ని

Most from this category