ఏడాది లక్ష్యంతో మిడ్‌క్యాప్స్ ఓకే..
By Sakshi

మిడ్‌క్యాప్స్‌లో వ్యాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయని ఎలారా సెక్యూరిటీస్ హెడ్ (ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ) రవి సుందర్ ముత్తుకృష్ణన్ తెలిపారు. అయితే వీటిల్లో మరికొంత డౌన్‌సైడ్ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్వెస్ట్మెంట్లకు ఇది సరైన సమయం కాదని, అయితే ఏడాది లక్ష్యంతో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చని సిఫార్సు చేశారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.
భారత్‌లో ప్రస్తుతం రూపాయి క్షీణత, క్రూడ్ ధరల పెరుగుదల, ద్రవ్యలోటు పెరుగుదల సమస్యలున్నాయని రవి సుందర్ తెలిపారు. రానున్న రోజుల్లోనూ ఇవి కొనసాగవచ్చని, మార్కెట్లు పడిపోవచ్చని అంచనా వేశారు. అయితే నిఫ్టీ 9,500 స్థాయికి వెళ్లకపోవచ్చని తెలిపారు. భారత్ ఎన్నికలు, అమెరికాలో మధ్యంతర పోల్స్ వంటి అంశాల ఆధారంగా చూస్తే నిఫ్టీ 9,900-10,000 స్థాయిలో కదలాడవచ్చని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో ఫలితం ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు ఉన్నాయని తెలిపారు. ఇరాన్‌పై ఆంక్షల వల్ల క్రూడ్ ధరలు పెరుగుతాయనే భయాలు ఉన్నాయని పేర్కొన్నారు. స్వల్పకాలంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ప్రస్తుతం మార్కెట్లకు దూరంగా ఉండటం మంచిదని సూచించారు. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్లకు భారత్ మంచి మార్కెట్ అని తెలిపారు.
మిడ్‌క్యాప్స్‌లో ఇంకా కరెక్షన్ మిగిలుందని రవి సుందర్ పేర్కొన్నారు. ఏడాది ప్రారంభంలో చూస్తే మిడ్‌క్యాప్స్, లార్జ్‌క్యాప్స్ మధ్య ప్రీమియం అంతరం 70-80 శాతం వరకు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఇది గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. మిడ్‌క్యాప్స్‌లో వ్యాల్యుయేషన్స్ తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఐదేళ్లుగా స్థిరమైన పనితీరు కనబరిచే, తక్కువ రుణ భారమున్న, క్యాష్ ఫ్లో ఎక్కువగా ఉన్న, మంచి ప్రాఫిట్ మార్జిన్ కలిగిన, సమర్థవంతమైన మేనేజ్మెంట్ ఉన్న మిడ్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి చాలా చౌక ధరలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మార్కెట్ అంచనాలకు వ్యతిరేకంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించిందని రవి సుందర్ పేర్కొన్నారు. వర్ధమాన మార్కెట్లు ఫెడ్ రేటుకు అనుగుణంగా రేట్లు పెంచుకుంటూ వెళ్తోంటే.. కేవలం ఒక్క భారత్ మాత్రం రేట్లను స్థిరంగా ఉంచిందని తెలిపారు. రానున్న కాలంలోనే అమెరికాలో రేట్ల పెంపు ఉండొచ్చని, అలా జరిగితే విదేశీ ఇన్వెస్టర్లు వారి ఇన్వెస్ట్మెంట్లను భారత్ నుంచి తీసుకెళ్లిపోతారని పేర్కొన్నారు. క్రూడ్ ధరలు ప్రస్తుత స్థాయిల్లో కొనసాగినా, రూపాయి ప్రస్తుత స్థాయిల్లో కదలాడినా రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, అప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లమేర పెంచుతుందని తెలిపారు.
ప్రస్తుత క్వార్టర్లో కాకపోతే అటుపై క్వార్టర్లోనైనా కంపెనీలు బలమైన పనితీరు కనబరుస్తాయని రవి సుందర్ అంచనా వేశారు. ఐటీ, కన్సూమర్ విభాగాలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్, సిమెంట్ విభాగాలు మోస్తారు పనితీరు కనబరుస్తుందని తెలిపారు. ఫార్మా ఆశ్చర్యకరమైన పనితీరుతో ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికలు, ఎర్నింగ్స్‌పై ఇన్వెస్టర్లు దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. ఎర్నింగ్స్ బాగుంటే మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే ఇరాన్‌పై ఆంక్షలు, మధ్యంతర ఎన్నికలు, ఐఎంఎఫ్ ప్రపంచ వృద్ధి అంచనాలు తగ్గించడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు.
You may be interested
లాభాలు ఒక్కరోజుకే పరిమితం
Tuesday 9th October 2018మార్కెట్‌కు మంట పెట్టిన ముడిచమురు ధర కొత్త కనిష్టానికి చేరిన రూపాయి మార్కెట్ లాభాలు ఒక్కరోజుకే పరిమితమయ్యాయి. సూచీలు మంగళవారం మళ్లీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడిచమురు మంటలు మరోసారి చెలరేగడంతో దేశీయంగా రూపాయి కొత్త కనిష్టాన్ని అందుకుంది. ఫలితంగా అటో, ఎఫ్ఎంజీసీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలు మార్కెట్‌కు నష్టాల ముగింపునకు కారణమయ్యాయి. నిఫ్టీ సూచి 47 పాయింట్ల నష్టంతో 10301 వద్ద, సెన్సెక్స్ 175 పాయింట్లను కోల్పోయి 34299
ఎన్నికలొస్తే మార్కెట్‌కు పండుగే!
Tuesday 9th October 2018ఎలక్షన్స్ అనంతరం ర్యాలీకే ఎక్కువ ఛాన్స్ మార్కెట్లలో ప్రవేశించేందుకు ఇదే మంచి తరుణమా? అవునంటున్నారు మార్కెట్ నిపుణులు. ఎన్నికలకు ముందు మార్కెట్లో ప్రవేశిస్తే ఎన్నికల అనంతరం మంచి లాభాలతో బయటకు రావచ్చంటున్నారు. ఇందుకు గత నిదర్శనాలను చూపుతున్నారు. గత 27 సంవత్సరాల డేటా పరిశీలిస్తే ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి ఎన్నికలయ్యాక రెండేళ్లలో సూచీలు భారీ లాభాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ దఫా మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నందున