STOCKS

News


రికవరి బాటలో ఫార్మా షేర్లు

Tuesday 14th May 2019
Markets_main1557826979.png-25735

గత ట్రేడింగ్‌ సెషన్‌లో భారీగా నష్టాలను చవిచూసిన ఫార్మా స్టాకులు మంగళవారం స్థిరమైన లాభాల్ని ఆర్జిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఫార్మా ఇండెక్స్‌ నేడు 2శాతం లాభపడింది. ఔషధ ధరల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై భారత్‌కు చెందిన సుమారు 20 కంపెనీలపై అమెరికాలోని 44 రాష్ట్రాలు కేసలు నమోదు చేయడంతో నిన్న ట్రేడింగ్‌లో తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే ఫార్మా రంగ షేర్లు రివకరీ బాట పట్టాయి. ఫార్మా షేర్లలో అత్యధిక వెయిటేజీ కలిగిన సన్‌ఫార్మా షేర్లు నేడు 5శాతం లాభపడింది. అలాగే గ్లెన్‌మార్క్‌, సిప్లా షేర్లు 2శాతం, లుపిన్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, బయోకాన్‌ షేర్లు 1శాతం పెరిగాయి. అలాగే డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి. మరోవైపు కేడిలా హెల్త్‌కేర్‌, 3.50శాతం నష్టపోయింది. దివీస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా షేర్లు అరశాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గతముగింపు(8,553.50)తో పోలిస్తే 1.50శాతం లాభంతో 8,665.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 14th May 2019

ఎడెల్‌వీజ్‌ సలహాలు దేశీయ సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయి. తొలుత స్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతో జోరు చూపిన మార్కెట్లు ప్రస్తుతం అస్థిర ప్రభుత్వ భయాలతో పతనమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌డీఏ, యూపీఏలకు పూర్తి మెజార్టీ రాక, ఇతర పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుందన్న భయాలు మార్కెట్‌ను కుంగదీస్తున్నాయి. ఫలితాల సమయంలో ఈ భయాలు బాగా పెరిగిపోతాయి. ఫలితాల రోజున సూచీల్లో తీవ్ర కదలికలు నమోదవుతుంటాయి. ఈ

హెచ్‌డీఎఫ్‌సీ షేరును ఏం చేద్దాం?

Tuesday 14th May 2019

బ్రోకరేజ్‌ల సలహాలు క్యు4 ఫలితాల అనంతరం హెచ్‌డీఎఫ్‌సీ షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి. 1. మాక్క్వైరీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ను రూ. 2400 నుంచి 2350కు తగ్గించింది. కంపెనీ వృద్దిలో కార్పొరేట్‌ రుణాల కారణంగా మందగమనం కనిపించింది. ఆస్తుల నాణ్యత క్షీణించలేదు అందువల్ల అండర్‌రైటింగ్‌ను పట్టించుకోనక్కర్లేదు. నికరవడ్డీ మార్జిన్‌ అంచనాలు తగ్గడంతో ఈపీఎస్‌ అంచనాలు 1- 5 శాతం మేర తగ్గించింది.  2. డాయిష్‌ బ్యాంక్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2300.

Most from this category