STOCKS

News


ఫార్మా...డౌన్‌

Monday 5th November 2018
Markets_main1541399630.png-21714

ఫార్మా షేర్లకు సిప్లా రెండో త్రైమాసిక ఫలితాలు షాకినిచ్చాయి. నేడు సిప్లా ప్రకటించి క్యూ2 ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలకు అందుకోలేకపోవడంతో సిప్లా షేర్లు 8శాతం పతనమైంది. సిప్లా కౌంటర్లో వెల్లువెత్తిన అమ్మకాలు క్రమంగా పుంజుకుంటూ ఇదే ఫార్మా రంగంలో మిగతా షేర్లను ముంచాయి.  ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ మధ్యాహ్నం‍ ట్రేడింగ్‌ సెషన్‌లో 1.50శాతం నష్టపోయింది. ఇదే సమయంలో దివీస్‌ల్యాబ్స్‌ 3శాతం నష్టపోయింది. అరబిందో ఫార్మా, బయోకాన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. మరోవైపు అత్యధికంగా పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌ షేరు 2శాతం లాభపడింది. కేడిల్లా హెల్త్‌కేర్‌ 1శాతం, సిప్లా, సన్‌ఫార్మా, లుపిన్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. ఇక ఈ వారంలో పలు ఫార్మా కంపెనీలు ఫలితాలను విడుదల చేయనున్నాయి. నేడు ఇప్పటికి సిప్లా క్యూ2 ఫలితాలు విడుదలవ్వగా,  నాట్కో ఫార్మా కంపెనీ ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది.

 



You may be interested

తగ్గిన సన్‌ టీవీ వెలుగులు

Monday 5th November 2018

ఆశాజనక రెండో త్రైమాసిక ఫలితాలు సన్‌ టీవీ షేర్లకు వెలుగునివ్వలేకపోయాయి. సన్‌టీవి ఈ క్యూ2లో ఆశించిన స్థాయిలో ఫలితాలను ఆర్జించినప్పటికీ.., ఈ కంపెనీ షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో 7శాతం నష్టపోయాయి. నేడు సన్‌టీవి షేర్లు బీఎస్‌ఈలో రూ.663.4ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపడతో షేరు 7శాతం క్షీణించి రూ.615.85లకు పతనమైంది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.663.4)తో పోలిస్తే 6.50శాతం నష్టపోయి రూ.619ల వద్ద

నేడే ఎస్‌బీఐ ఫలితాలు.. ఎలా ఉండొచ్చు?

Monday 5th November 2018

దేశీ దిగ్గజ బ్యాంక్‌ ‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ (ఎస్‌బీఐ) సోమవారం జూలై- సెప్టెంబర్‌ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలను వెల్లడించనుంది. ప్రస్తుత క్యూ2లో వార్షిక ప్రాతిపదికన చూస్తే బ్యాంక్‌ నికర లాభం సగానికిపైగా తగ్గొచ్చనే అంచనాలున్నాయి. మొండి బకాయిల కోసం అధిక కేటాయింపులు, నికర వడ్డీ ఆదాయంలో స్వల్ప వృద్ధి, తక్కువ నిర్వహణ/ఇతర ఆదాయం వంటి అంశాలు లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని బ్రోకరేజ్‌ సంస్థలు పేర్కొంటున్నాయి. నొమురా,

Most from this category