లాభాల్లో ఫార్మా షేర్లు
By Sakshi

డాలర్ మారకంలో రూపాయి బలహీనత ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. నేడు ట్రేడింగ్‌లో రూపాయి డాలర్ మారకంలో 72.05 స్థాయికి పతనమైంది. రూపాయి క్షీణత విదేశాలకు ఎగుమతులు చేసి డాలర్ల మారకంలో ఆదాయాలను ఆర్జించే కంపెనీలకు కలిసొస్తుందని అంచనాలతో ఫార్మా షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్ఎస్ఈలో అన్ని ఇండెక్స్‌లో అత్యధికంగా ఫార్మా ఇండెక్స్ 3శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్ గతముగింపుతో పోలిస్తే 2.55శాతం లాభంతో 8,753.35 వద్ద ట్రేడ్ అవుతోంది. సన్‌ఫార్మా 6శాతం ఫార్మా ఇండెక్స్‌కు బలనిచ్చింది. గ్లెన్‌మార్క్, 4శాతం లాభపడగా, అదే బాటలో బయోకాన్ 3శాతం, లుపిన్, పిరమల్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 2.50శాతం, కెడిల్లా హెల్త్‌కేర్ 2శాతం లాభపడ్డాయి. లుపిన్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్ 1శాతం పెరిగాయి. అరబిందో ఫార్మా అరశాతం పెరిగాయి.
You may be interested
రికవరీ సూచించిన బ్యాంకు నిఫ్టీ ఆప్షన్లు
Tuesday 11th December 2018దేశీయ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో రోజువారీ కనిష్ఠస్థాయి నుంచి కోలుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్ షేర్ల మద్దతు సూచీలను ఆదుకొంది. ఉర్జిత్పటేల్ రాజీనామాను, ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మంచి ర్యాలీ జరిపాయి. దీంతో మార్కెట్లు రికవరీ బాట పట్టాయి. సూచీల్లో ఇంత షార్‌్ప రికవరీ ఆశ్చర్యకరంగా కనిపించినా బ్యాంకు నిఫ్టీ ఆప్షన్లు పరిశీలిస్తే కారణం తెలిసిపోతుంది. మంగళవారం ట్రేడింగ్‌లో బ్యాంకు నిఫ్టీ 25598 పాయింట్ల కనిష్ఠాన్ని తాకి
ఆర్బీఐ కొత్త గవర్నర్ నుంచి సరళ విధానాలు-మార్కెట్ అంచనా
Tuesday 11th December 2018కేంద్ర ప్రభుత్వపు వృద్ధి లక్ష్యాలు.. ఆర్బీఐ ఆర్థిక నిర్వహణ అంశాలు రెండూ కలిస్తే బాగుంటుందని కేఆర్ చోక్సీ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఎండీ దెవేన్ చోక్సీ తెలిపారు. వచ్చే కొత్త గవర్నర్ ఇదే విధానాన్ని అనుసరిస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. మార్కెట్ వర్గాలు చాలా అంశాలను గమనిస్తూ ఉంటుందని, అందులో ఒకటి ఆర్బీఐ గవర్నర్ అంశమని తెలిపారు. కొత్త