STOCKS

News


నష్టాల్లో ఫార్మా షేర్లు

Wednesday 5th December 2018
Markets_main1543996082.png-22661

కీలక వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల నిరీక్షణ నేపథ్యంలో మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాలతో ట్రేడ్‌ అవుతోంది. సూచీల నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా ఫార్మా షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌స్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 1.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు ఫార్మా ఇండెక్స్‌ గతముగింపుతో పోలిస్తే 1.25శాతం నష్టంతో 8,955.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి సూచీలోకి మొత్తం10 షేర్లలో 7 షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతుండగా, 3 షేర్లు మాత్రం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అత్యధికంగా సన్‌ఫార్మా 2.50శాతం నష్టపోయింది. సిప్లా, లుపిన్‌, అరబిందో ఫార్మా 2శాతం క్షీణించాయి. దివీస్‌ల్యాబ్స్‌, పిరమిల్‌ఎంటర్‌ప్రైజెస్‌ 1శాతం నష్టపోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు అరశాతం నష్టపోయింది. మరోవైపు కేడిల్లా హెల్త్‌కేర్‌ 2శాతం లాభపడగా, గ్లెన్‌మార్క్‌, బయోకాన్‌ షేర్లు 1శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
మధ్యాహ్నం గం.1:00లకు నిఫ్టీ ఇండెక్స్‌ 75 పాయింట్లు నష్టపోయి 10800ల దిగువన 10795 వద్ద, సెన్సెక్స్‌ 200 పాయింట్లు కోల్పోయి 36వేల కింద 35923 వద్ద ట్రేడ్‌ అవుతోంది.You may be interested

ఒప్పొ ట్రిపుల్‌ కెమెరా స్మార్ట్‌ఫోన్‌.. ధరెంతో తెలుసా?

Wednesday 5th December 2018

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘ఒప్పొ’ తాజాగా మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘ఆర్‌17 ప్రో’ను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కంపెనీ నుంచి ఆర్‌ సిరీస్‌లో వస్తోన్న తొలి స్మార్ట్‌ఫోన్‌ ఇదే. ఇందులో 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ఫ్లస్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ లెవెల్‌ 6 ప్రొటెక‌్షన్‌, వాటర్‌డ్రాప్‌ నాచ్‌, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 710 ప్రాసెసర్‌, 128 జీబీ మెమరీ, 8 జీబీ

టాటామోటర్స్‌కు రేటింగ్‌ షాక్‌..!

Wednesday 5th December 2018

3.50శాతం నష్టపోయిన షేరు అటోమెబైల్‌ దిగ్గజం టాటా మోటర్స్‌ షేర్లకు బుధవారం రేటింగ్‌ షాక్‌ తగిలింది. తన అనుబంధ బ్రిటన్‌ సంస్థ  జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) రేటింగ్స్‌ను.... రేటింగ్‌ సంస్థ ఎస్‌అండ్‌పీ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో టాటా మోటర్స్‌ కంపెనీ షేర్లు 3.50శాతం నష్టపోయాయి. ఆదాయాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడంతో ఎస్‌అండ్‌పీ సంస్థ... కంపెనీ ‘‘రుణ రేటింగ్‌’’ను బిబి స్థాయి నుంచి బిబి నెగిటివ్‌ స్థాయికి కుదించినట్లు టాటామోటర్స్‌ తెలిపింది. అలాగే జేఎల్‌ఆర్‌

Most from this category