STOCKS

News


ఫార్మా షేర్లు అప్‌

Wednesday 21st November 2018
Markets_main1542783889.png-22262

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ..,  ఫార్మా షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా సూచి బుధవారం 2శాతం ర్యాలీ చేసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు ఫార్మా షేర్ల ర్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ చెందిన సుబోగ్జిన్ జనరిక్ మెడిసన్‌ ఔషధాలకు అమెరికన్ ఫెడరల్ కోర్టులో సానుకూల తీర్పు రావడంతో ఆ కంపెనీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. షేరు అత్యధికంగా ఇంట్రాడేలో 8.67శాతం పెరిగింది. అలాగే అరబిందో ఫార్మా 3శాతం, బయోకాన్‌ 2శాతం, గ్లెన్‌మార్క్‌ 1.50శాతం పెరిగాయి. సిప్లా, సన్‌ఫార్మా, కేడిల్లా హెల్త్‌కేర్‌ 1శాతం లాభపడ్డాయి. దీవీస్‌ల్యాబ్స్‌, లుపిన్‌ షేర్లు అరశాతం ర్యాలీచేశాయి. అయితే పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు మాత్రం అరశాతం నష్టంతో ట్రేడ్‌ అవుతుంది. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(9,218.70)తో పోలిస్తే 2శాతం లాభంతో 9,387ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీలో మొత్తం 10 షేర్లకు గానూ 9 షేర్లు లాభాల్లో, 1షేరు మాత్రం నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.  ఇదే సమయానికి డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 7శాతం లాభంతో నిఫ్టీ-50 సూచీలో టాప్‌-5 గెయినర్లలో ప్రథమస్థానంలో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై బుల్లిష్‌

Wednesday 21st November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై బుల్లిష్‌గా ఉంది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌ స్టాక్‌: శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.842 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,537 కోటక్‌ సెక్యూరిటీస్‌.. శంకర్‌ బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌పై పాజిటివ్‌గా ఉంది. స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,537గా నిర్ణయించింది. కంపెనీ ప్రస్తుత క్యూ2 రెవెన్యూ అంచనాల కన్నా దిగువునే ఉందని తెలిపింది. కేరళ, దక్షిణ కర్నాటక

10,500 వరకు బుల్స్‌దే హవా..!

Wednesday 21st November 2018

ముంబై: గతవారం 10,450-10,650 స్థాయిలో కన్సాలిడేషన్‌ పూర్తిచేసిన నిఫ్టీ ఈ శ్రేణి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. నిఫ్టీ 200-రోజుల సగటు కదలికల స్థాయి (డీఎంఏ) 10,750 పాయింట్ల వద్ద ఉండగా, 50-రోజుల సగటు కదలికల స్థాయి 10,715 వద్ద ఉన్నట్లు మోనార్క్‌ నెట్‌వర్త్‌ క్యాపిటల్‌ విశ్లేషకులు అర్పన్ షా తెలిపారు. వచ్చే 2-3 రోజుల్లో 10,700 వద్ద కన్సాలిడేషన్‌కు అవకాశం ఉండగా.. 10,750 పాయింట్ల ఎగువన ముగిస్తే మాత్రం 10,820

Most from this category