News


ఫార్మా షేర్లకు‘‘సన్‌ ఫార్మా’’ అండ

Friday 28th December 2018
Markets_main1545985894.png-23288

4శాతం లాభపడ్డ సన్‌ఫార్మా షేర్లు
ముంబై:- సన్‌ ఫార్మా షేర్ల ర్యాలీ అండతో శుక్రవారం ఫార్మా షేర్లు పరుగులు పెడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ 2శాతానికి పైగా లాభపడింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 8,700.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇండెక్స్‌ 2శాతం లాభపడి 8830.10 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గతముగింపు (8,665.75)తో పోలిస్తే 1.75శాతం లాభపడి 8,820.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన సన్‌ ఫార్మా 4శాతం ర్యాలీ చేసి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 గెయినర్లలో మొదటిస్థానాన్ని దక్కించుకుంది. కేడిల్లా హెల్త్‌కేర్‌, అరబిందో ఫార్మా, పిరమిల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ షేర్లు 2శాతం పెరిగాయి. గ్లెన్‌మార్క్‌ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, బయోకాన్‌, సిప్లా షేర్లు 1శాతం లాభపడ్డాయి. లుపిన్‌ అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతుండగా, దివీస్‌ ల్యాబ్స్‌ అరశాతం నష్టపోయింది.



You may be interested

ఈ ఏడాదిలో తీవ్ర నష్టాలను పంచిన షేర్లివే..!

Friday 28th December 2018

ఈ ఏడాదిలో దేశీయ ఈక్విటీ మార్కెట్‌ తీవ్రమైన ఆటుపోట్ల మధ్య ర్యాలీ చేసింది. అంతర్జాతీయంగా అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు పెరిగి మార్కెట్లో అనిశ్చితి ఏర్పడటంతో పాటు దేశీయంగా ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ద్రవ్య కొరత సంక్షోభం, బ్యాంకింగ్‌ వ్యవస్థలో పెరిగిన మొండిబకాయిలు, కార్పోరేషన్‌ గవర్నెన్స్‌ సమస్యతో పాటు పలు వివాదస్పదమైన రాజకీయ అంశాతో మార్కెట్‌ తీవ్రఒడిదుడుకులకు లోనైంది. అయినప్పటికీ.., ఇదే ఏడాదిలో సెన్సెక్స్‌ సూచీ ఆగస్ట్‌

టాటా, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ల పోటాపోటీ

Friday 28th December 2018

వాల్యూషన్లలో పోటీ పడుతున్న టాప్‌ బిజినెస్‌ గ్రూప్‌లు  భారత్‌లో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థానం కోసం హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌, టాటా గ్రూప్‌లు పోటీ పడుతున్నాయి. ఒకరోజు ట్రేడింగ్‌ చివరకు టాటా గ్రూప్‌ వాల్యూషన్‌ పరంగా టాప్‌టో ఉంటే మరోరోజు హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ ముందుంటోంది. బుధవారం ట్రేడింగ్‌ చివరకు టాప్‌ కార్పొరేట్‌ గ్రూప్‌గా ఉన్న టాటా గ్రూప్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ అగ్రస్ధానానికి చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌లోని ఐదు కంపెనీల ఉమ్మడి విలువ

Most from this category