STOCKS

News


ఫార్మా షేర్ల ర్యాలీకి ‘‘సన్‌ ఫార్మా’’ అండ

Monday 31st December 2018
Markets_main1546244536.png-23332

  • 3.50శాతం లాభపడిన సన్‌ఫార్మా

ఆరంభ లాభాల్ని కోల్పోయిన మార్కెట్లో సోమవారం ఫార్మా రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో 1శాతం లాభపడింది. మధ్యాహ్నం గం.1:30లకు ఇండెక్స్‌ గతముగింపు(8,814.20)తో పోలిస్తే 0.75శాతం లాభంతో 8881.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సన్‌ఫార్మా అత్యధికంగా 3.50శాతం ర్యాలీ లాభపడి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌కు దన్నుగా నిలుస్తోంది. అలాగే పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, దివిస్‌ ల్యాబ్స్‌ షేర్లు 2శాతం ర్యాలీ చేశాయి. లుపిన్‌ కేడిల్లా హెల్త్‌కేర్‌, అరబిందో ఫార్మా షేర్లు 1శాతం పెరిగాయి. అలాగే గ్లెన్‌మార్క్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మరోవైపు గ్లాస్కో స్మిత్‌లైన్‌, సిప్లా షేర్లు అరశాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఇండెక్స్‌లోని టాప్‌-5 గెయినర్లలో సన్‌ఫార్మా (3.50శాతం లాభం) రెండో స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

నిఫ్టీ 11,000 దాటేముందు....కన్సాలిడేషన్‌

Monday 31st December 2018

  కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా   నిఫ్టీ 11,000 స్థాయిని దాటేముందుగా... కన్సాలిడేట్‌ అవుతుందని కొటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ అభిప్రాయపడ్డారు. గతవారం నిఫ్టీ ఇటీవలి గరిష్టస్థాయి అయిన 10,985 పాయింట్ల స్థాయిని అధిగమించలేక, అంచనాలకంటే అధికంగా పడిపోయిందని, అటుతర్వాత వేగంగా కోలుకున్నప్పటికీ, హెవీవెయిట్‌ షేర్లు వాటి తాజా గరిష్టస్థాయిల్ని చేరేందుకు ఇబ్బందిపడుతున్నందున, నిఫ్టీ కొద్దిరోజులపాటు కన్సాలిడేట్‌ కావొచ్చన్న అంచనాలు ఏర్పడుతున్నాయని ఆయన వివరించారు. గత వారం రోజుల కదలికలు,

స్వల్ప నష్టాల్లో పసిడి

Monday 31st December 2018

అమెరికా చైనాల మ‌ధ్య వాణిజ్య యుద్ధ చ‌ర్చ‌లు స‌ఫ‌లం కావ‌చ్చ‌నే అంచ‌నాల నేప‌థ్యంలో సోమ‌వారం ప‌సిడి ధ‌ర‌ స్వ‌ల్పంగా న‌ష్ట‌పోయింది. ఆసియా ట్రేడింగ్లో ఉదయం సెషన్లో 3.50డాలర్లకు పైగా నష్టపోయింది. డాలర్ ఇండెక్స్ వారం రోజుల కనిష్టం నుంచి కోలుకోవడం కూడా పసిడి ట్రేడింగ్ పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. చైనా అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన ట్వీట్లో పేర్కోనడంతో

Most from this category