News


ఫార్మా షేర్లు.. అండర్‌వ్యాల్యూనే!!

Monday 10th September 2018
Markets_main1536575860.png-20132

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లపై ఒత్తిడి నెలకొని ఉంది. కన్సాలిడేషన్‌ కొనసాగుతోంది. తొలి రోజే ఈ విషయం అర్ధమైంది. రూపాయి పతనం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది. ‘వర్ధమాన మార్కెట్లకు ఇది పరీక్షలాంటి సమయం. అమెరికాకు నిధులు వెళ్లిపోతున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు ఇందుకు కారణం. అందువల్ల వర్ధమాన మార్కెట్లపై దీని ప్రభావం ఉంటుంది’ అని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఫౌండర్‌ సౌరభ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. స్థూల ఆర్థికాంశాల కోణంలో చూస్తే భారత్‌పై ఎలాంటి భయాలు అవసరం లేదన్నారు. అయితే అమెరికాకు నిధుల ప్రవాహంపైన ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్విటీ విభాగంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటి దాకా విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకపుదారులుగా ఉన్నారని తెలిపారు. ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ 2.5-3 శాతానికి తగ్గిందని, ఫండ్‌ మేనేజర్లు వర్ధమాన మార్కెట్లపై ఆందోళనతో ఉండటం ఇందుకు కారణమని పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రవాహాన్ని ఫెడరల్‌ రిజర్వు నియంత్రిస్తుందనే అంశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫండ్‌ మేనేజర్లకు తెలుసన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్‌గా చూస్తే బలంగా ఉందని తెలిపారు. 

యాక్సిస్‌ బ్యాంక్‌పై స్పందిస్తూ.. 
యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త బాస్‌గా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌కు చెందిన అమితాబ్‌ చౌదరీ బాధ్యతలు చేపట్టనున్నారని సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. శిఖా శర్మ స్థానంలో ఈయన జనవరి 1 నుంచి మూడేళ్లపాటు విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలో అమితాబ్‌ పనితీరు బాగుందని, అయితే బ్యాంకింగ్‌ రంగంలో ఆయన పనితీరు చూడాల్సి ఉందని తెలిపారు. యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి మరికొన్ని నిష్క్రమణలు చూడొచ్చని పేర్కొన్నారు.
 
గత మార్కెట్‌ ర్యాలీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు బాగా పెరిగాయని సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. ఇవి ఇప్పుడు 8-10 శాతం కరెక‌్షన్‌కు గురయ్యాయని పేర్కొన్నారు. అధిక బాండ్‌ ఈల్డ్‌, వడ్డీ రేట్ల పెరుగుదల నేపథ్యంలో హోల్‌సేల్‌ ఫండ్‌ లెండర్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బలమైన కాసా రేషియో ఉన్న బ్యాంకులు మంచిదని తెలిపారు. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. మొత్తంగా చూస్తే స్టాక్‌ మార్కెట్‌ 15-20 శాతం ఓవర్‌వ్యాల్యూ కలిగి ఉందని, అదే ఫైనాన్షియల్‌ విభాగం 40 శాతం ఓవర్‌వ్యాల్యూ కలిగి ఉందని పేర్కొన్నారు.

ఫార్మా గురించి..
ఫార్మా రంగంలో పలు షేర్లు అండర్‌వ్యాల్యూతో ఉన్నాయని సౌరభ్‌ ముఖర్జీ తెలిపారు. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, లుపిన్‌ స్టాక్స్‌ను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. రూపాయి పతనం ఫార్మా రంగానికి సానుకూల అంశమని తెలిపారు. దీంతో గత 8-9 నెలలుగా ఫార్మా షేర్లు మంచి పనితీరు కనబరుస్తున్నాయని పేర్కొన్నారు. 4-5 ఏళ్లకు ముందు ఇలాంటి పరిస్థితులు లేవని గుర్తుచేశారు. వచ్చే ఆరు నెలల కాలంలో ఎగుమతి ఆధారిత కంపెనీల స్టాక్స్‌కు మంచి కాలం ఉంటుందని తెలిపారు. 
 You may be interested

సూచీలకు రూపాయి షాక్‌..!

Monday 10th September 2018

  నిఫ్టీకి 150 పాయింట్ల నష్టం 38వేల దిగువకు సెన్సెక్స్‌ ముంబై:- సూచీలకు రూపాయి పతనం షాక్‌నిచ్చింది. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు పెరుగుదల, దేశీయ కరెంట్‌ ఖాతా లోటు తగ్గిపోవడం, బాండ్‌ ఈల్డ్‌ నాలుగేళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు బలహీన అంతర్జాతీయ సంకేతాలు సూచీలపై ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా ఇంట్రాడేలో అటో, బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మెటల్‌ రంగాలకు చెందిన షేర్లలో అమ్మకాల సునామి నెలకొంది. దీంతో మార్కెట్‌ ముగిసే సమాయానికి ప్రధాన

టెక్‌ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవొచ్చు!

Monday 10th September 2018

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో టెక్నాలజీ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని జూలియస్‌ బేర్‌కు చెందిన మార్క్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు. రూపాయి కష్టాలకు అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవ్వడం, వాషింగ్టన్‌-బీజింగ్‌ మధ్య నడుస్తోన్న వాణిజ్య యుద్ధం కారణమని తెలిపారు. రానున్న రోజుల్లో ఈక్విటీ మార్కెట్‌ను ఏ ఏ అంశాలు ప్రభావితం చేస్తాయో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.   మనమున్న ప్రాంతం

Most from this category