STOCKS

News


ఆర్‌ఈసీ ఇక పీఎఫ్‌సీ సొంతం

Thursday 21st March 2019
Markets_main1553167277.png-24739

ప్రభుత్వరంగంలోని విద్యుత్‌ రంగ ఫైనాన్స్‌ సంస్థలు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ మధ్య డీల్‌ ఖరారైంది. పెట్టుబడుల ఉపసంహరణ, వాటాల విక్రయంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.80,000 కోట్లను సమీకరించాలనే లక్ష్యాన్ని విధించుకున్న విషయం తెలిసిందే. ఈ లక్ష్యం చేరికలో భాగంగానే కేంద్ర సర్కారు ఆర్‌ఈసీలో తనకున్న 52.63 శాతం వాటాను పీఎఫ్‌సీకి విక్రయించడం ద్వారా నిధుల సమీకరణకు మొగ్గు చూపించింది. ఈ డీల్‌కు ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సైతం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం విదితమే. దీనిపై పీఎఫ్‌సీ బోర్డు సానుకూల నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఈసీలో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం 52.63 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్టు... ఇందుకోసం రూ.14,500 కోట్లను వ్యయం చేస్తున్నట్టు పీఎఫ్‌సీ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ కొనుగోలు ఈ నెలఖారులోపే పూర్తవుతుందని తెలిపింది. 

 

ఈ డీల్‌ కింద ఒక్కో ఆర్‌ఈసీ షేరుకు రూ.139.50ను పీఎఫ్‌సీ చెల్లించడం ద్వారా...  కేంద్ర పభుత్వానికి ఉన్న మొత్తం 104 కోట్ల షేర్లు (52.63శాతం) సొంతం చేసుకుంటుంది. ఈ లావాదేవీ మార్చి 31 నాటికి పూర్తవుతుందని పీఎఫ్‌సీ తెలిపింది. లావాదేవీ పూర్తయిన తర్వాత పీఎఫ్‌సీకి ఆర్‌ఈసీలో 52.63 శాతం వాటా ఉంటుంది. ‘‘పీఎఫ్‌సీ ఆర్‌ఈసీలో భారత ప్రభుత్వానికి ఉన్న 52.63 శాతం వాటాను సొంతం చేసుకునే డీల్‌ను ఖరారు చేసింది. బిడ్‌ విలువ రూ.14,499.99 కోట్లు (ఒక్కో షేరు రూ.139.50). యాజమాన్య నియంత్రణ బదిలీ సహా ఈ డీల్‌ ఉంటుంది. విద్యుత్‌ ఎన్‌బీఎఫ్‌సీలో సమన్వయం లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ 2018 డిసెంబర్‌ 6న ఆమోదం తెలిపింది’’ అని దీపం సెక్రటరీ ట్వీట్‌ చేశారు. ఆర్‌ఈసీలో వాటాల విక్రయం తర్వాత కూడా ఈ రెండు ప్రభుత్వరంగ సంస్థలుగానే కొనసాగుతాయని పీఎఫ్‌సీ తెలిపింది. ఈ డీల్‌ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సమీకరించిన నిధులు రూ.70,000 కోట్లను దాటేశాయి. బుధవారం ఆర్‌ఈసీ స్టాక్‌ బీఎస్‌ఈలో 2.39 శాతం నష్టంతో రూ.144.85 వద్ద క్లోజ్‌ అవగా, పీఎఫ్‌సీ 5.35 శాతం నష్టపోయి రూ.114 వద్ద ముగిసింది.
 You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Friday 22nd March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పూర్తిగా సరళతర విధానాన్ని అనుసరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో  నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ  భారత్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45  గంటలకు 11,578  పాయింట్ల వద్ద కదులుతోంది.బుధవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,553  పాయింట్ల వద్ద

నిధుల ప్రవాహం బలంగా ఉంటే ఫండమెంటల్స్‌ పట్టించుకోరు!

Thursday 21st March 2019

అజయ్‌ బగ్గా సాధారణంగా మార్కెట్లో ట్రెండ్‌కు వ్యతిరేకంగా పోవద్దని సలహా ఇస్తారు. ప్రస్తుతం మార్కెట్లోకి లిక్విడిటీ ప్రవాహం ఒక్కమారుగా పెరిగిందని, ఈ ట్రెండ్‌కు ఎదురుపోవడం మంచిదికాదని ప్రముఖ ఇన్వెస్టర్‌ అజయ్‌ బగ్గా సలహా ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఫండమెంటల్స్‌లో పెద్దమార్పులేమీ రాలేదని, కానీ ఉన్నట్లుండి ఎఫ్‌ఐఐల నుంచి నిధుల ప్రవాహం పెరగడంతో మార్కెట్లు మూలాలను మర్చిపోయాయని చెప్పారు. ఒపీనియన్‌ పోల్స్‌ ప్రకారం మరోమారు సుస్థిర ప్రభుత్వం వస్తుందన్న నమ్మకాలు దేశీయంగా సెంటిమెంట్‌ను బలపరిచాయన్నారు.

Most from this category