STOCKS

News


పెట్రో షేర్ల పతనం

Friday 30th November 2018
Markets_main1543572250.png-22529

ముంబై:- పెట్రోరంగ కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ పతనమయ్యాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర క్షీణించిన నేపథ్యంలో భారీ ర్యాలీ జరిపిన ఈ షేర్లలో నేడు లాభాల స్వీకరణ జరుగుతుందని విశ్లేషకుల అంచనా.
హెచ్‌పీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.242.95ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో షేరు 5శాతం పతనమై రూ.230.30ల కనిష్టానికి తగ్గింది. మధ్యాహ్నం గం.2:30లకు షేరు గతముగింపు ధర(రూ.242.90)తో పోలిస్తే 4శాతం లాభపడి రూ.233.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 సూచీలో టాప్‌లూజర్లలో మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది.
బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.329.10ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో షేరు 2.50శాతం తగ్గుదలతో రూ.320.40ల కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30లకు షేరు గతముగింపు ధర(రూ.328.50)తో పోలిస్తే 1.50శాతం నష్టపోయి రూ.323.65 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఆయిల్‌ ఇండియా:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.190.00ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో షేరు 7.50శాతం పతనమై రూ.186.55ల కనిష్టానికి పతనమైంది. మధ్యాహ్నం గం.2:30లకు షేరు గతముగింపు ధర(రూ.201.90)తో పోలిస్తే 7శాతం నష్టపోయి రూ.186.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐఓసీ ఇటీవల ప్రకటించిన బైబ్యాక్‌కు డిసెంబర్‌ 03(సోమవారం)ను రికార్డు తేదిగా నిర్ణయించింది. ఓఐఎల్‌ లిమిటెడ్‌ రూ.1,085 కోట్ల విలువ చేసే 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయనుంది. ఓఐఎల్‌ బోర్డు 4.45 శాతం షేర్లను బైబ్యాక్‌ చేయడానికి ఆమోదం తెలిపిందని ఆ కంపెనీ రెగ్యూలేటరికి సమాచారమిచ్చింది. ఒక్కో షేర్‌కు రూ.215 చెల్లించనున్నారు.



You may be interested

వచ్చే ఏడాది నిఫ్టీ ఎర్నింగ్స్‌ వృద్ధి 12 శాతం..!

Friday 30th November 2018

ముంబై: ప్రస్తుత వాతావరణంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు పలు మిడ్‌క్యాప్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్‌ షిబని కురియన్ అన్నారు. వచ్చే 3-5 ఏళ్ల పెట్టుబడి వ్యూహంతో బలమైన వృద్ధి కనబర్చనున్నటువంటి కంపెనీలలో అత్యంత బలమైన యాజమాన్యం కలిగి, మూలధన కేటాయింపు విధానాలు బలంగా ఉండి, ఉన్నతమైన రిటర్న్‌ రేషియోను కలిగిఉన్నటువంటి సంస్థల షేర్లలో పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయని

ఐటీ, ఎనర్జీ రంగాలకు ఓవర్‌వెయిట్‌..

Friday 30th November 2018

ముంబై: డాలర్‌ రూపాయి మారకం విలువ దీర్ఘకాలంలో బలహీనపడిన నేపథ్యంలో ఐటీ రంగ వ్యాపారం మెరుగుపడిందని యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వినయ్ పహారియా విశ్లేషించారు. మరోవైపు ఎనర్జీ రంగ వాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నిరాశాజనక వృద్ధి, మార్జిన్లతో ఫైనాన్షియల్‌ రంగం ఏమంత ఆసక్తిగా లేదన్నారు. ప్రభుత్వ వ్యయం నెమ్మదించడం, వినిమయం తగ్గడం వంటి ప్రతికూల అంశాలు ఎన్‌బీఎఫ్‌సీ

Most from this category