STOCKS

News


వెలుగులో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Wednesday 24th October 2018
Markets_main1540370272.png-21446

ముంబై:- అంతర్జాతీయంగా చమురు ధరలు దిగిరావడంతో బుధవారం పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాజాగా సౌదీ అరేబియా తగినంత చమురును ఉత్పత్తి చేయనున్నట్లు ప్రకటించింది. పలితంగా చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి విలువ పడటం కూడా పెట్రోరంగ షేర్లకు కలిసోస్తుంది. ఈ రంగలో ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీల్‌, ఐఓసీ షేర్లు 6నుంచి 5శాతం లాభపడ్డాయి.
బీపీసీఎల్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.278.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 6శాతం లాభపడి రూ.284.05 స్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.269.05)తో పోలిస్తే 4శాతం లాభంతో రూ.280.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.239.00లు రూ.550.00లుగా నమోదయ్యాయి.
హెచ్‌పీసీఎల్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.226.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం లాభపడి రూ.228.60 స్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.217.10)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.224.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.163.00లు, రూ.484.00లుగా నమోదయ్యాయి.
ఐఓసీ:- నేడు బీఎస్‌ఈలో రూ.134.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం లాభపడి రూ.135.95 స్థాయిని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.130)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.134.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.105.00లు, రూ.221.00లుగా నమోదయ్యాయి.


IOC

You may be interested

బజాజ్‌ ఆటో లాభం @ 1,152 కోట్లు

Wednesday 24th October 2018

ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్‌ ఆటో తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికపు (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4 శాతం వృద్ధితో రూ.1,152 కోట్లకు పెరిగింది. కంపెనీ నికర లాభం మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకుంది. మార్కెట్‌ వర్గాలు లాభం రూ.1,145 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర

డాలీఖన్నా పోర్టుఫోలియో రివ్యూ

Wednesday 24th October 2018

మిడ్‌క్యాప్‌ మొగల్‌గా పేరొందిన డాలీఖన్నా సెప్టెంబర్‌ త్రైమాసికంలో పలు కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో దాదాపు 50 శాతం వరకు పతనమైన పలు కంపెనీలను ఎంచుకొని డాలీ ఖన్నా వాటాలు కొనుగోళ్లు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డాలీ పోర్టుఫోలియోలో పలు స్టాకులు పది శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి. క్యు2లో డాలీ ఖన్నా పోర్టుఫోలియోలో వచ్చిన మార్పులు... - ఐఎఫ్‌బీ ఆగ్రో ఇండస్ట్రీస్‌, మత్తూట్‌ క్యాపిటల్‌, నోసిల్‌, రాడికో

Most from this category