News


ఇప్పుడే ఏమైంది... ముందుంది మరింత బాదుడు!

Saturday 6th October 2018
Markets_main1538764526.png-20900

కేవలం 25 ట్రేడింగ్‌ సెషన్లలోనే సెన్సెక్స్‌ 4,600 పాయింట్లు పతనమైంది. దీన్నొక విపత్తుగా ఇన్వెస్టర్లు భావిస్తుంటే... ఓ అనలిస్ట్‌ మాత్రం వచ్చే ఆరు వారాల్లోపే అమ్మకాల సునామీ ఉందంటున్నారు. ఇందుకు ఆయన కొన్ని కారణాలు కూడా పేర్కొన్నారు. స్థూల ఆర్థిక అంశాలు, ప్రతికూల వార్తలైన చమురు ధరలు, రూపాయి పతనం, కార్పొరేట్‌ పరిణామాలకు స్పందించే గుణం మాన మార్కెట్లకు ఉంటుందని తెలిసిందే. రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న కొన్ని అంశాలు మన మార్కెట్లకు వ్యతిరేకంగా పరిణమించొచ్చన్నది విశ్లేషణ. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అమెరికాలో మధ్యంతరంగా జరిగే ఎన్నికలు, మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికలు మార్కెట్ల కరెక్షన్‌కు దారితీసే అంశాలుగా పేర్కొంటున్నారు. 

 

నిఫ్టీ 9,900 దిశగా వెళుతుందని భావిస్తున్నామని ఐడీబీఐ క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ తెలిపారు. అంటే నిఫ్టీ మరో​400 పాయింట్లు, సెన్సెక్స్‌ 1,200 పాయిం‍ట్ల మేర ఈ స్థాయి నుంచి పడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే నెలన్నర కాలం ఈక్విటీ మార్కెట్లకు చాలా బాధాకరమేనన్నారు. ఆందోళన కలిగించే అతిపెద్ద అంశం ఇరాన్‌పై అమెరికా ఆంక్షలేనన్నారు. ఇవి నవంబర్‌ 4 నుంచి అమల్లోకి వస్తాయి. భారత్‌ 10-12 శాతం చమురును ఇరాన్‌ నుంచే సమకూర్చుకుంటోంది. చమురు ఉత్పత్తికి కలిగే విఘాతాన్ని మార్కెట్‌ ఇంకా తక్కువగానే అంచనా వేస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియా, రష్యాలు చమురు ఉత్పత్తిని పెంచాలన్న అమెరికా పిలుపును పట్టించుకోకపోవడంతో, ఉత్పత్తికి పెద్ద విఘాతం నెలకొంటే ధరలు భారీగా పెరిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఇప్పటి నుంచి ఆరు నెలల్లో నవంబర్‌ మధ్య నాటికి ఇరాన్‌ ఆంక్షల వల్ల ఏం జరుగుతందన్నది తెలుస్తుందని మాక్వేర్‌ క్యాపిటల్‌కు చెందిన ఇంద్రజీత్‌ సింగ్‌ భాటియా పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.17,664 కోట్ల విదేశీ ఈక్విటీ నిధులు బయటకు తరలిపోయాయి. 2008లో ఇలా బయటకు వెళ్లిన రూ.52,987 కోట్ల తర్వాత మళ్లీ ఇదే అత్యధికం. ‘‘నిధుల ఆధారంగానే మార్కెట్ల కదలిక ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు ఈ ఏడాది నష్టాలతో కొనసాగుతున్నాయి. అయినప్పటికీ రిటైల్‌ నిధులను అవి ఇంత కాలం రాబట్టుకోగలిగాయి. ప్రతికూల రాబడుల మధ్య ఇదే పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు’’ అని ఏకే ప్రభాకర్‌ పేర్కొన్నారు. 

 

గమనించాల్సిన అంశాలు... 

  • నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత అమెరికా తన స్నేహదేశాలతో ఎలా మసులుకుంటుందన్నది చూడాలి. వాణిజ్య యుద్ధం, ఇరాన్‌పై ఆంక్షల విషయంలో ఈ ఎన్నికల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి. 
  • మాటలతో కూడిన వాణిజ్య యుద్ధం అమెరికాలో మధ్యంతర ఎన్నికల తర్వాత వెనక్కిపోతుందా అన్నది చూడాల్సి ఉంది. 
  • ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో మన దేశానికి వెసులుబాటు ఉంటుందా లేదా అన్నది. ఒకవేళ ఆంక్షలను మన దేశం కూడా అమలు చేయాల్సి వస్తే, అది మన దేశంలో చుమరు ధరలపై ద్రవ్యోల్బణంపై అధిక ప్రభావం చూపిస్తుంది. దాంతో రూపాయి క్షీణత, కరెంటు ఖాతా లోటు విస్తరిస్తుంది. 
  • డిసెంబర్‌లోపు జరిగే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు... రానున్న సాధారణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో సంకేతాలిస్తాయి. సానుకూలంగా లేకపోతే మరింత మార్కెట్‌ సునామీకి దారితీస్తుందన్నది విశ్లేషకుల అంచనా. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Saturday 6th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,270 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,347 పాయింట్లతో పోలిస్తే 77 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌ లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  శుక్రవారం ఆర్‌బీఐ వడ్డీ

విదేశీ ఇన్వెస్టర్లు దీర్ఘకాలానికి సానుకూలమే: మార్క్‌మోబియస్‌

Saturday 6th October 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం విదేశీ ఇన్వెస్టర్లు కలవరపరిచే అంశంగా ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు మార్క్‌ మోబియస్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నవి, భారత్‌లో అదే తరహా ఇతర కంపెనీలు కూడా భారీ రుణాలపైనే నడుస్తున్నట్టు ఇన్వెస్టర్లకు తెలియజేస్తోందన్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల కెరటాల మాదిరి ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. ఇతర దేశాలు

Most from this category