STOCKS

News


త్వరలో పెన్నా సిమెంట్స్‌ ఐపీఓ

Tuesday 6th November 2018
Markets_main1541480767.png-21738

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న  పెన్నా సిమెంట్స్‌ సంస్థ త్వరలో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రానుంది. ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించనుంది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయటంతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) భాగంగా కంపెనీ ప్రమోటర్‌ పీఆర్‌ సిమెంట్‌ హోల్డింగ్స్‌ రూ.250 కోట్ల షేర్లను విక్రయించనుంది. ఈ ఐపీఓ నిధులను రుణ భారం తగ్గంచుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా ఎడిల్‌వేజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, జేఎమ్‌ ఫైనాన్షియల్‌, యస్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తున్నాయి. 
దక్షిణ భారత దేశంలో ప్రముఖ సిమెంట్‌ కంపెనీల్లో పెన్నా సిమెంట్‌ ఒకటి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రల్లో నాలుగు సిమెంట్‌ తయారీ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్‌ యూనిట్లు ఉన్నాయి. ఏడాదికి ఈ కంపెనీ 10 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. కాగా గత నెలలోనే ఇమామి సిమెంట్స్‌ సంస్థ రూ.1,000 కోట్ల సమీకరణ కోసం ఐపీఓకు అనుమతివ్వాలంటూ సెబీకి దరఖాస్తు చేసింది. 

పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఐపీఓకు సెబీ ఆమోదం 
పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓలో భాగంగా 24.64 శాతం వాటాకు సమానమైన 49.58 కోట్ల ఈక్విటీ షేర్లను ఈ కంపెనీ భాగస్వామ్య సంస్థలు విక్రయిస్తాయి. దీంట్లో పీఎన్‌బీ 8 కోట్ల షేర్లను, మెట్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ ఎల్ఎల్‌సీ 12.90 కోట్ల షేర్లను, ఎమ్‌ పల్లోంజీ అండ్‌ కంపెనీ 10.76 కోట్ల షేర్లను, ఎల్‌ప్రో ఇంటర్నేషనల్‌ సంస్థ 7.66 కోట్ల షేర్లను, 7.65 కోట్ల షేర్లను జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌లు  విక్రయిస్తాయి. ఈ ఐపీఓకు కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీ, డీఎస్‌పీ మెరిల్‌లించ్‌, సిటీ గ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, పీఎన్‌బీ ఇన్వెస్ట్‌మెంట్‌ సర్వీసెస్‌ వ్యవహరిస్తున్నాయి. కాగా స్టాక్‌ మార్కెట్లో ఇప్పటికే ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఎప్‌సీ స్డాండర్డ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు లిస్టయ్యాయి. 
 You may be interested

115 శాతం పెరిగిన నాట్కో లాభం

Tuesday 6th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ తయారీ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబరు త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం కిందటేడాదితో పోలిస్తే 115 శాతం అధికమై రూ.181.6 కోట్లకు ఎగసింది. టర్నోవరు 35 శాతం పెరిగి రూ.583 కోట్లను తాకింది. ఏప్రిల్‌- సెప్టెంబరు కాలంలో రూ.1,158 కోట్ల టర్నోవరుపై రూ.362 కోట్ల నికరలాభం నమోదైంది. ఫార్ములేషన్స్‌ వ్యాపారంలో దేశీయం మార్కెట్‌తోపాటు ఎగుమతుల పరంగా మెరుగైన వృద్ధి

దుస్తుల వ్యాపారంలోకి పతంజలి

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ:  యోగా గురు బాబా రాందేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద తాజాగా బ్రాండెడ్ దుస్తుల వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. 'పరిధాన్‌' బ్రాండ్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.1,000 కోట్ల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు బాబా రాందేవ్ ఈ సందర్భంగా సోమవారమిక్కడ చెప్పారు. పరిధాన్ కింద లివ్‌ఫిట్‌, ఆస్థా, సంస్కార్‌ అనే మూడు బ్రాండ్లు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. "ఈ ఏడాది 500- 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం

Most from this category