News


నష్టాల్లో పీసీఏ బ్యాంకులు

Tuesday 20th November 2018
Markets_main1542693560.png-22219

ముంబై:- పీసీఏ నిబంధనల పరిధిలో ఉన్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు మంగళవారం 7శాతం నష్టపోయాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు సోమవారం ఆర్‌బీఐ బోర్డు సోమవారం సమావేశం నిర్వహించింది. ఆ సమావేశంలో పీసీఏ పరిధిలోని 11 ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి ఆర్‌బీఐ బోర్డు వచ్చింది. అయితే అనూహ్యంగా పీసీఏ పరిధిలోకి 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాల బాట పట్టాయి. సమస్యలతో సతమతమవుతున్న 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించేందుకు రిజర్వు బ్యాంకు వాటిని పీసీఏ (ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్) నిబంధనల పరిధిలోకి తీసుకొచ్చి, వాటిపై కొన్ని ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే...!

పీసీఏ బ్యాంకుల పతనం (శాతాల్లో)
క్రమ సంఖ్య బ్యాంక్‌ పేరు షేరు క్షీణత (శాతాల్లో)
1 బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర  7.00శాతం
2 ఓరియంటల్‌ బ్యాంక్‌  5.50శాతం
3 కార్పోరేషన్‌ బ్యాంక్‌  5.50శాతం
4 బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 5.20శాతం
5 అలహదాబాద్‌ బ్యాంక్‌ 3.50శాతం
6 యూకో బ్యాంక్‌ 3.00శాతం
7 ఇండియన్‌ఓవర్సీస్‌బ్యాంక్‌ 3.00శాతం
8 దేనాబ్యాంక్‌  3.00శాతం
9 యూనిటెడ్‌ బ్యాంక్‌ 2.00శాతం
10 సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 1.50శాతం
11 ఐడీబీఐ బ్యాంక్‌  1.00శాతం



You may be interested

భారత్‌పై అండర్‌వెయిట్‌..

Tuesday 20th November 2018

భారత్‌ మార్కెట్‌పై ప్రస్తుతం అండర్‌వెయిట్‌తో ఉన్నామని జులియస్‌ బేర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మార్క్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఈ ఏడాది ఇండియన్‌ మార్కెట్లు కరెక‌్షన్‌కు గురైనా కూడా.. చైనా, ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే ఇంకా వ్యాల్యుయేషన్స్‌ ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  వర్ధమాన మార్కెట్లు ప్రస్తుతం పడిపోయాయని మార్క్‌ మాథ్యూస్‌ తెలిపారు. ఈ ఏడాది చివరిలో ర్యాలీ ఉండొచ్చని అంచనా

స్థిరంగానే పసిడి ధర

Tuesday 20th November 2018

అమెరికా బలహీన ఆర్థిక గణాంకాల విడుదల, ప్రపంచ ఆర్థిక మందగమనంపై ఫెడ్‌ అధికారుల ఆందోళన తదితర అంశాలు డాలర్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. పసిడి ధరకు ఈ అంశం సానుకూలంగా మారింది. ఫలితంగా మంగళవారం ప్రపంచమార్కెట్లో పసిడి స్థిరమైన ర్యాలీ చేస్తుంది. ఆసియా మార్కెట్లో భారత వర్తమానకాల ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1.00డాలర్లు స్వల్పంగా నష్టపోయి 1,224.30 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా

Most from this category