STOCKS

News


బైబ్యాక్‌పై పీసీ జువెలరీస్‌ రివర్స్‌ గేర్‌

Saturday 14th July 2018
Markets_main1531566458.png-18325

గతంలో ప్రకటించిన రూ. 424 కోట్ల రూపాయల బైబ్యాక్‌ ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు పీసీజువెలరీస్‌ ప్రకటించింది. బైబ్యాక్‌కు తమ బ్యాంకర్‌ నుంచి ఓన్‌ఓసీ పొందడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ బోర్డు ప్రకటించింది. తమ రుణాల కారణంగా బైబ్యాక్‌కు బ్యాంకర్‌ అనుమతి తప్పనిసరని ఎక్చేంజ్‌లకు కంపెనీ వెల్లడించింది. ఇకమీదట వ్యాపార వృద్ధిపై శ్రద్ధ పెట్టాలని, వడ్డీ వ్యయాలను తగ్గించుకోవడానికి యత్నించాలని బ్యాంకరు సూచించినట్లు వెల్లడించింది. రుణభారంతో ఉన్న సమయంలో అసలు బ్యాంకరు నుంచి ఎన్‌ఓసీ తీసుకోకుండా కంపెనీ బైబ్యాక్‌ను ఎలా ప్రకటించిందని మార్కెట్‌ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్లలో పేలవమైన గవర్నెన్స్‌, అధ్వాన్న ప్రమాణాలకు ఇది మరో నిదర్శనమని విమర్శిస్తున్నారు. గత ఆరునెలల్లో కంపెనీ షేరు దాదాపు 80 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. వక్రంగీతో వ్యాపార బంధం, ప్రమోటర్లపై అనుమానాలతో ఇన్వెస్టర్లు ఈ షేరుపై అవిశ్వాసం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై కంపెనీ వివరణలు ఇచ్చినా షేరు పతనం ఆగలేదు. 
బైబ్యాక్‌ కథా కమామీషు..
షేర్ల బైబ్యాక్‌ను గత మేనెల్లో కంపెనీ ప్రకటించింది. ఒక్కో షేర్‌ను రూ.350కు బైబ్యాక్‌ చేస్తామని తెలిపింది. అప్పటి ట్రేడింగ్‌ ధరతో పోల్చితే బైబ్యాక్‌ ధర 67 శాతం అధికం. మొత్తం పెయిడప్‌ ఈక్విటీ క్యాపిటల్‌లో 3.07 శాతం వాటాకు సమానమైన 1.21 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ చేయనున్నామని, ఈ షేర్ల బైబ్యాక్‌కు రూ.424 కోట్లు కేటాయించామని కంపెనీ వివరించింది. ఇందులో ప్రమోటర్లు పాల్గొనరని, బైబ్యాక్‌కు తగినంత మిగులు నిధులు తమ వద్ద ఉన్నాయని కంపెనీ తెలిపింది. అయితే ఎన్ని చెప్పినా ఈ షేరు పతనం మాత్రం ఆగలేదు. జనవరిలో రూ. 600 వద్ద ఉన్న షేరు ప్రస్తుతం రూ.110 వద్ద తారట్లాడుతోంది.

 



You may be interested

15 షేర్లు.. 77 శాతం రాబడి..!

Saturday 14th July 2018

ముంబై: ఈ ఏడాదిలో ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్‌, అత్యధిక నాణ్యత కలిగిన మిడ్‌క్యాప్స్‌ షేర్లలో పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచించిన బ్రోకింగ్‌ సంస్థ సెంట్రమ్‌ వెల్త్‌ రీసెర్చ్‌.. 77 శాతం రాబడి ఇవ్వగలిగిన 15 షేర్లను సూచించింది. అవేంటంటే.. ఆదిత్య బిర్లా క్యాపిటల్ టార్గెట్ ధర రూ.185 రాబడి అంచనా 42 శాతం రిటైల్‌, ఎస్‌ఎమ్‌ఈ విభాగాలలో ఫోకస్‌ పెంచడం వల్ల లోన్‌ బుక్‌లో వృద్దిరేటు 25 శాతానికి మించి ఉండవచ్చని అంచనావేస్తోంది. మ్యూచువల్‌ ఫండ్‌ విభాగమైన

అపోటెక్స్‌ వ్యాపారం అరబిందో చేతికి...

Saturday 14th July 2018

కెనెడాకు చెందిన జెనరిక్స్‌ ఉత్పత్తిదారు అపోటెక్స్‌కు చెందిన ఐదు దేశాల వ్యాపారాన్ని అరబిందో ఫార్మా కొనుగోలు చేసింది. ఈ మేరకు అపోటెక్స్‌తో అరబిందో అనుబంధ సంస్థ ఎగెల్‌ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్‌ విలువ 7.4 కోట్ల యూరోలు. ఈ ఆల్‌క్యాష్‌ (ఎటువంటి రుణాలు లేకుండా మొత్తం నగదు రూపంలో అందిచడం)ఒప్పందంలో భాగంగా పోలెండ్‌, చెక్‌, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, బెల్జియం దేశాల్లో అపోటెక్స్‌ వ్యాపారం(వాణిజ్య కార్యకలాపాలు, ఇన్‌ఫ్రా) అరబిందో చేతికి

Most from this category