News


బై బ్యాక్‌ రద్దు - పీసీ జ్యువెలర్‌ భారీ పతనం

Monday 16th July 2018
Markets_main1531722242.png-18341

ముంబై:-  బై బ్యాక్‌ ప్రణాళిక రద్దు అంశం తెరపైకి రావడంతో పీసీ జ్యువెలర్‌ షేరు సోమవారం భారీగా పతనమైంది. నేటి బీఎస్‌ఈలో ట్రేడింగ్‌లో 24 శాతం నష్టపోయింది. మే నెలలో ప్రకటించిన రూ.424 కోట్ల ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రణాళికను రద్దు చేసుకుంటున్నట్లు పీసీ జ్యువెలర్‌ శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చింది. బై బ్యాక్‌కు తమ బ్యాంకర్‌ నుంచి ఎన్‌ఓసీ పొందడంలో విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ బోర్డు ప్రకటించింది. ఫలితంగా నేడు పీసీ జ్యువెలర్‌ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో షేరు 24 శాతం నష్టపోయి రూ. 90.95ల వద్ద 52-వారాల కనిష్టానికి పతనమయ్యింది. ఉదయం గం.11:35ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.119.95)తో పోలిస్తే 23శాతం నష్టంతో రూ.92.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పలు ఆరోపణలతో జ్యువెలర్‌ ఈ ఏడాది ఆరంభం నుంచి ఏకంగా 83శాతం నష్టపోయింది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు రూ.90.95లు రూ.600.65లుగా ఉన్నాయి.



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ షేరు 10 శాతం క్రాష్‌

Monday 16th July 2018

డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరెటరీస్‌ షేరు ట్రేడింగ్‌ మార్నింగ్‌ సెషన్‌లో 10 శాతనికిపైగా పడిపోయింది. న్యూజెర్సీ డిస్ట్రిక్‌ కోర్టు తన ప్రాథమిక దర్యాప్తులో పేటెంట్‌ నెం.9,931,305కి సంబంధించి కంపెనీకి వ్యతిరేకంగా తాత్కాలిక ఉత్తర్వులను జారీచేసింది. దీనివల్ల పేటెంట్‌ సమస్య తీరేంతవరకు రెడ్డీస్‌ ల్యాబ్స్‌కి అమెరికా మార్కెట్‌లో సుబొక్సొన్‌ జెనరిక్‌ను విక్రయించడానికి వీలుండదు. ఈ నేపథ్యంలో రెడ్డీస్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లోనే 10.7 శాతానికిపైగా పడిపోయింది. ఇదే నిఫ్టీ టాప్‌

23 శాతం రాబడి కోసం 3 స్టాకులు

Monday 16th July 2018

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్స్‌ 1. అర్వింద్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 505. స్టాప్‌లాస్‌ రూ. 385. వందవారాల మూవింగ్‌ యావరేజ్‌ స్థాయి వద్ద మద్దతు తీసుకొని పైకి ఎగిసింది. గతవారం అధోముఖ వాలురేఖను పైవైపుగా ఛేదించింది. గతంలో ఇలాంటి రివర్సల్‌ చూపినప్పుడు దాదాపు 40 శాతం ర్యాలీ జరిపింది. ప్రస్తుతం టెక్నికల్‌ఇండికేటర్లన్నీ పాజిటివ్‌గా బుల్లిష్‌ మోడ్‌లో ఉన్నాయి. ఈ దఫా అప్‌మూవ్‌లో మరోమారు ఆల్‌టైమ్‌హైని తాకవచ్చని అంచనా. 2. బీపీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌

Most from this category