STOCKS

News


ఓపిక ఉంటేనే లాభాలు!

Sunday 14th October 2018
Markets_main1539540041.png-21139

స్టాక్‌ మార్కెట్లలో ఇటీవలి కరెక్షన్‌ కొంత మంది ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసింది. మార్కెట్లు మరో 10 శాతం వరకు దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు లేకపోలేదని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు సౌరభ్‌ ముఖర్జియా పేర్కొన్నారు. నిజానికి ఈక్విటీలన్నవి సహజంగా ఆటుపోట్లతో కూడి ఉంటాయని, కాకపోతే నష్టాలను పరిమితం చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. నష్టాలను పరిమితం చేసుకోవడం అన్నది లాభాలు గడించేందుకు కీలకమని చెబుతున్నారు. భారీ నష్టాల పాలు కాకుండా, లాభాలను కాపాడుకునేందుకు, లాభాలు గడించేందుకు నిపుణులు చెబుతున్న సూత్రాలు ఇవి...

 

సాధనం గురించి తెలుసుకోవడం
ఓ పెట్టుబడి సాధనం అంతర్గత విలువ పట్ల దృష్టి సారించాలి. పెట్టుబడి పెట్టే ముందు స్టాక్‌ గురించి తెలుసుకోవాలి. సదరు కంపెనీ ఏం తయారు చేస్తోంది, ఏ విధంగా నిర్వహిస్తోంది, కంపెనీ ఆస్తులు, అప్పుల గురించి తెలుసుకోవాలి. 

వదంతులు వద్దు... 
చాలా మంది ఊహాగానాల్లో చిక్కుకుంటారు. ఓ రంగంలో ధోరణి చూసిన తర్వాత ఊహాగానాలపై ఆధారపడతారు. దీంతో వాస్తవ అంశాలను విస్మరిస్తుంటారు. ఎన్ని ఊహాగానాలు ఉన్నప్పటికీ, పెట్టుబడి అనేది జూదం కాదని గుర్తు పెట్టుకోవాలి. భవిష్యత్తు గురించి అంచనాలు కాకుండా, వాస్తవ అంశాలు, అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి అవగాహనకు రావాలి.

ఓపిక
సహనం అన్నది స్టాక్‌ ఇన్వెస్టింగ్‌లో విజయానికి ముఖ్యమైన అంశం. ‘స్టాక్‌ మార్కెట్‌ అన్నది చురుగ్గా ఉన్న వారి నుంచి ఓపికగా ఉన్న వారి దగ్గరకు డబ్బులను బదిలీ చేసేందుకు డిజైన్‌ చేయబడింది’ అన్నది వారెన్‌ బఫెట్‌ అభిప్రాయం. ఓపిక ద్వారానే మంచి ప్రతిఫలం అందుకోగలరు. 

వైవిధ్యం
అన్ని గుడ్లను తీసుకెళ్లి ఒకే బాస్కెట్‌లో ఎలా అయితే పెట్టకూడదో... పెట్టుబడులను కూడా ఒకే చోట కాకుండా లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మధ్య వేరు చేసుకోవాలి. 

తొందరపాటు వద్దు
కొనుగోలు చేసి, వాటిని కొనసాగించిన వారే ఎక్కువగా స్టాక్‌ మార్కెట్లో మంచి లాభాలు ఆర్జిస్తుంటారు. తొందరపాటుతో అమ్మేస్తే లాభాలు పరిమితం అవుతాయి. అలాగే, ఏదైనా ప్రతికూల వార్త స్టాక్‌లో ఆటుపోట్లను పెంచుతుంది. ఇటీవల ఇన్ఫీబీమ్‌ అవెన్యూస్‌ స్టాక్‌ 70 శాతం పతనమైంది. కంపెనీ అకౌంటింగ్‌ విధానాలపై వాట్సాప్‌ సందేశం అందుకు కారణమైంది. ఎన్ని లెక్కలు వేసుకున్నా, ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో నష్టాలు తప్పకపోవచ్చు. You may be interested

సెప్టెంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ కొనుగోళ్లు

Sunday 14th October 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ను నిపుణులైన మేనేజర్లు నిర్వహిస్తుంటారు. ఏ స్టాక్‌ను ఎప్పుడు విక్రయించాలి, ఎప్పుడు కొనుగోలు చేయాలనే విషయంలో సాధారణ ఇన్వెస్టర్లతో పోలిస్తే ఫండ్స్‌ మేనేజర్లు సదా అప్రమత్తంగా వ్యవహరిస్తుంటారు. అలా అయితేనే వారు ఇన్వెస్టర్ల పెట్టుబడులపై రాబడులు తీసుకురాగలరు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగించగా... దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర)

అవెన్యూ సూపర్‌ మార్ట్‌ లాభం 18 శాతం అప్‌

Saturday 13th October 2018

రిటైల్‌ వ్యాపార సంస్థ అవెన్యూ సూపర్‌(డీ-మార్ట్‌) ఈ క్యూ2లో మార్కెట్‌ ఆశించిన స్థాయిలోనే ఫలితాలను నమోదు చేసింది. . ఈ క్యూ2లో  కంపెనీ నికర లాభం 18 శాతం వృద్ధి చెంది రూ. 226 కోట్లను సాధించింది. గతేడాది ఇదే క్యూ2లో రూ.191 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,872.52 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3507 కోట్లతో పోలిస్తే ఇది 39శాతం ఎక్కువ. ఇదే

Most from this category