STOCKS

News


బాండ్‌ మార్కెట్‌పై త్వరలో సెబీ చర్చా పత్రం

Wednesday 11th July 2018
Markets_main1531328845.png-18229

ముంబై: బాండ్‌ మార్కెట్‌ అభివృద్ధి కోసం మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ త్వరలో ఒక చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నది. పెద్ద కంపెనీలు తమ రుణావసరాల్లో నాలుగోవంతు భాగాన్ని బాండ్లద్వారానే సమీకరించడం తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనతో  ఈ చర్చాపత్రాన్ని సెబీ త్వరలో తేనున్నది. ఈ ఏడాది బడ్జెట్‌లో బాండ్ల మార్కెట్‌ అభివృద్ధి కోసం చర్యలు తీసుకోనున్నామని ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా ఈ చర్చాపత్రాన్ని తెస్తున్నామని, ఈ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలతో సంప్రదింపులు జరిపి తుది ముసాయిదాను రూపొందిస్తామని  సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వివరించారు. 

బాండ్‌ మార్కెట్‌ @ 29,000 కోట్ల డాలర్లు 
కంపెనీలు తీసుకున్న రుణాలను చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో మొండి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. వీటికి భారీగా కేటాయింపులు జరపడంతో పలు ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు భారీ నష్టాలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో బాండ్ల ద్వారా నిధుల సమీకరణ ప్రతిపాదన ప్రాముఖ్యత సంతరించుకున్నది. బాండ్‌ మార్కెట్‌కు భారీగా వృద్ధి అవకాశాలున్నాయని, దీనికి పటిష్టమైన సెకండరీ మార్కెట్‌ అవసరమని అజయ్‌ త్యాగి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బాండ్‌ మార్కెట్‌ 29,000 కోట్ల డాలర్లుగా ఉందని, ఇది జీడీపీలో 17 శాతమేనని పేర్కొన్నారు. 80 శాతంగా ఉన్న ఈక్విటీ మార్కెట్‌తో పోల్చితే బాండ్‌ మార్కెట్‌ చాలా తక్కువ స్థాయిలో ఉందని వివరించారు. 



You may be interested

ఎల్‌ఐసీ, ఐడీబీఐ బ్యాంక్‌ డీల్‌ సెప్టెంబర్‌ కల్లా పూర్తి !

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో ఈ ఏడాది సెప్టెంబరుకల్లా ఎల్‌ఐసీ మెజారిటీ వాటాను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐడీబీఐ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఐఆర్‌డీఏఐ నుంచి ఎల్‌ఐసీ ఇటీవలే ఆమోదం పొందటం తెలిసిందే. ఐడీబీఐ బ్యాంక్‌ ఆస్తులు, అప్పులు, తదితర అంశాలపై ప్రస్తుతం ఎల్‌ఐసీ మదింపు నిర్వహిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌ మైనారిటీ వాటాదారుల కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించే

టాటా కొత్త ఎస్‌యూవీ ‘హారియర్‌’

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తన కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ‘హారియర్‌’ను ఎప్పుడు మార్కెట్‌లోకి తీసుకువస్తున్నది ప్రకటించింది. 2019 తొలి త్రైమాసికంలో దీన్ని ఆవిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్‌ ఈ హారియర్‌ ఎస్‌యూవీని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌తో కలిసి అభివృద్ధి చేస్తోంది. కాగా కంపెనీ ఆటో ఎక్స్‌పో 2018లో హెచ్‌5ఎక్స్‌ కాన్సెప్ట్‌తో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. స్టైల్‌, టెక్నాలజీ, పర్ఫార్మెన్స్‌

Most from this category