STOCKS

News


కరాచీ ఇండెక్స్‌ క్రాష్‌

Tuesday 26th February 2019
Markets_main1551172590.png-24340

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఏర్పడ్డ ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో అటు పాకిస్థాన్‌ దేశపు ఎక్చే‍్సంజ్‌లు కూడా భారీగా నష్టపోతున్నాయి. నేడు కరాచీ స్టాక్‌ ఇండెక్స్‌(కేఈసీ) 465 పాయింట్లు(1.17శాతం) నష్టపోయి 39,142.29 వద్దకు పతనమైంది. పుల్వామా ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా భారత వాయుదళం ఎల్‌ఓసీని దాటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం మూడు నిర్దేశిత లక్ష్యాలపై వెయ్యి కిలోల పేలుడు పదార్థాలు గల లేజర్‌ గైడెడ్‌ బాంబులతో యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. మొత్తం 21 నిమిషాల్లోనే జరిగిన ఈ దాడుల్లో సుమారు 300-400 మంది ఉగ్రవాదులు మరణించి ఉంటారని సమాచారం వెల్లడైంది.



You may be interested

జీ ఎంటర్‌టైన్‌మైంట్‌ జోరు

Tuesday 26th February 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో భారీ లాభపడుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేరు రూ.442.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కంపెనీలో వాటా కొనుగోలు కోసం అంతర్జాతీయంగా పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వాటిలో ప్రధానంగా సోనీ, కామ్‌కాస్ట్‌, యాపిల్‌, అలీబాబా సంస్థలు ముందంజలో ఉన్నాయని సమాచారం వెల్లడైంది. ఈ వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో షేరు 10శాతం లాభపడి రూ.489.75ల గరిష్టానికి చేరుకుంది.

27000 దిగువకు బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 26th February 2019

నష్టాల మార్కెట్లో భాగంగా బ్యాంక్‌ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఎక్కువగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ గ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 1.50శాతం నష్టపోయింది. అయితే మార్కెట్‌ రికవరీలో భాగంగా ఇండెక్స్‌ నష్టాలను పరిమితం చేసుకుంది. మధ్యాహ్నం గం.1:00లకు ఇండెక్స్‌ గతముగింపు(26,736.60)తో పోలిస్తే 0.60శాతం (171.05 పాయింట్లు) నష్టపోయి 27000 దిగువున 26,988 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Most from this category