STOCKS

News


ఎర్నింగ్స్‌ రిస్క్‌ ఉంది...జాగ్రత్త

Friday 16th November 2018
Markets_main1542364440.png-22103

కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ పరంగా చూస్తే రిస్క్‌ ఇంకా మిగిలే ఉందని, రానున్న కాలంలో కంపెనీల లాభాల వృద్ధి తగ్గొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికాన్ని తీసుకుంటే.. ఎర్నింగ్స్‌ పరంగా 2015 నుంచి అదే బలహీనమైన క్వార్టర్‌ అని తెలిపింది. దీనికి జీఎస్‌టీ అమలు కారణమని, దీని వల్ల దేశీ ఫార్మా, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, పెయింట్స్‌, ఇండస్ట్రీయల్స్‌ రంగాలపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ రంగాల్లో మెరుగైన వృద్ధి నమోదయ్యిందని తెలిపింది. అయితే రెండో త్రైమాసికంలో బేస్‌ ఎఫెక్ట్‌ పోయిందని పేర్కొంది. ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరపు ఎర్నింగ్స్‌ వృద్ధి అంచనాల్ని 3.5 శాతంమేర తగ్గించామని, ఇది క్యూ1 ఎర్నింగ్స్‌ వృద్ధి అంచనా తగ్గింపు 3 శాతం కన్నా ఎక్కువని పేర్కొంది. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ఎర్నింగ్స్‌ వృద్ధి తగ్గొచ్చని తెలిపింది. ​
వడ్డీ రేట్లు కూడా మార్కెట్ల దిశను నిర్దేశించనుందని తెలిపింది. అమెరికాలో వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్ల బాండ్‌ ఈల్డ్స్‌పై ఒత్తిడి పెరిగిందని పేర్కొంది. రానున్న కాలంలోను ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచే సూచనలున్నాయని, అందువల్ల వర్ధమాన దేశాల నుంచి ఇన్వెస్ట్‌మెంట్లు తరిలి వెళ్లిపోయే పరిస్థితులు రావొచ్చని తెలిపింది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో లిక్విడిటీ తగ్గిందని పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలకు కమర్షియల్‌ పేపర్‌ మార్కెట్‌ యాక్సెస్‌ పరిమితంగానే ఉందని, అలాగే రిడంప్షన్లు పెరిగాయని, అందువల్ల ఎన్‌బీఎఫ్‌సీ వ్యవస్థపై ఒత్తిడి మరింత పెరగొచ్చని వివరించింది. స్థూల ఆర్థికాంశాలు ప్రతికూలముగా కనిపిస్తున్నా కూడా ఎఫ్‌పీఐలు నవంబర్‌లో ఇప్పటి దాకా చూస్తే కొనుగోలుదారులుగా ఉన్నారని, ఇది సానుకూల అంశమని పేర్కొంది. సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్లు బాగున్నాయని తెలిపింది. రానున్న ఎన్నికల సీజన్‌ వల్ల మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉండొచ్చని పేర్కొంది. 



You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బాండ్ల జారీ..!

Friday 16th November 2018

ముంబై: ప్రైవేటు రంగ ఫైనాన్స్‌ దిగ్గజమైన హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) త్వరలోనే బాండ్లను జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుబాటు గృహ రుణ మంజూరీ పెంచడం కోసం వచ్చే ఏడాది జనవరిలో సంస్థ డాలర్‌ బాండ్ల జారీ ద్వారా ఒక బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,185 కోట్లు)ను సమీకరించనుందని అనధికారికంగా వెల్లడైంది. ప్రస్తుతం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) నిధుల కొరతతో అల్లాడుతుండగా.. ఈ సమస్యను అధిగమించడంలో

10,650 పైన నిఫ్టీ

Friday 16th November 2018

రాణించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం సానుకూల అంతర్జాతీయ సంకేతాలతో దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ముగిసింది. నేడు ట్రేడింగ్‌లో కూడా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం, ఆసియా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ఐరోపా మార్కెట్ల లాభాల ట్రేడింగ్‌ సూచీలకు కలిసొచ్చాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 71.71 స్థాయికి బలపడటంతో సూచీలు రోజంతా లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. ముఖ్యంగా స్టాక్‌

Most from this category