STOCKS

News


పీనోట్‌ పెట్టుబడులు రూ.66,587 కోట్లు

Monday 19th November 2018
Markets_main1542604668.png-22169

న్యూఢిల్లీ: పార్టిసిపేటరీ నోట్స్‌ ద్వారా మన క్యాపిటల్‌ మార్కెట్లలోకి వచ్చే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తగ్గుతూనే ఉన్నాయి.  సెబీ గణాంకాలను పరిశీలిస్తే పీనోట్‌ పెట్టుబడులు (ఈక్విటీ, డెట్‌, డెరివేటివ్స్‌) ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికి రూ.79,548 కోట్లుగా ఉండగా, అక్టోబర్‌ చివరి నాటికి రూ.66,587 కోట్లకు తగ్గిపోయాయి. తొమ్మిదేళ్ల కాలంలోనే 2009 మార్చి తర్వాత ఇది కనిష్ట స్థాయి కావడం గమనార్హం. రిజిస్ట్రేషన్‌ చేసుకోని విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే, అందుకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు పీనోట్లు జారీ చేస్తుంటారు. ఇక ఈ ఏడాది ఆగస్ట్‌లో పీ నోట్‌ పెట్టుబడులు రూ.84,647 కోట్లుగా ఉండడం గమనార్హం. పీ నోట్ల దుర్వినియోగంపై ఆరోపణలు రావడంతో సెబీ నిబంధనలను కఠినం చేయడమే పెట్టుబడులు తగ్గడానికి కారణంగా నిపుణులు పేర్కొంటున్నారు. అక్టోబర్‌ చివరి నాటికి ఈక్విటీల్లో పీ నోట్‌ పెట్టుబడులు రూ.50,584 కోట్లు ఉండగా, మిగిలిన మొత్తం డెట్‌, డెరివేటివ్‌ మార్కెట్లో ఉన్నాయి. 



You may be interested

క్రూడ్‌, విదేశీ పెట్టుబడులు కీలకం

Monday 19th November 2018

ముంబై: చమురు ధరలు, విదేశీ నిధుల ప్రవాహం ఈ వారం మార్కెట్‌ పయనాన్ని నిర్ణయించనున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం ఏ విధంగా ఉంటుంది? లిక్విడిటీ సమస్య నివారణకు ఆర్‌బీఐ సోమవారం (ఈ నెల 19న) నాటి భేటీలో తీసుకునే నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రాల ఎన్నికల ప్రభావంతో ఒడిదుడుకులు ఉంటాయని భావిస్తున్నారు. ‘‘రూపాయి కదలిక, చమురు ధరలు, విదేశీ పెట్టుబడులను ఇన్వెస్టర్లు

కేంద్రం సంస్కరణలు కొనసాగించాలి

Monday 19th November 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్య సాధనకు కేంద్రం కట్టుబడి ఉండాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. మరోవైపు గత నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన సంస్కరణలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం, దివాలా చట్టం వంటి సంక్లిష్టమైన చట్టాలను ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు ఇబ్బందిపడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రవేశపెట్టడంతో పాటు

Most from this category