ఐటీ, ఎనర్జీ రంగాలకు ఓవర్‌వెయిట్..
By Sakshi

ముంబై: డాలర్ రూపాయి మారకం విలువ దీర్ఘకాలంలో బలహీనపడిన నేపథ్యంలో ఐటీ రంగ వ్యాపారం మెరుగుపడిందని యూనియన్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ వినయ్ పహారియా విశ్లేషించారు. మరోవైపు ఎనర్జీ రంగ వాల్యుయేషన్స్ ఆకర్షణీయంగా ఉన్నట్లు ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నిరాశాజనక వృద్ధి, మార్జిన్లతో ఫైనాన్షియల్ రంగం ఏమంత ఆసక్తిగా లేదన్నారు. ప్రభుత్వ వ్యయం నెమ్మదించడం, వినిమయం తగ్గడం వంటి ప్రతికూల అంశాలు ఎన్బీఎఫ్సీ రంగంలో క్రెడిట్ ఫ్లోను తగ్గించేందుకు అవకాశం ఉందన్నారు. ఇక పూర్తి మార్కెట్ విషయానికి వస్తే.. ఇంకొంతకాలం ఒడిదుడుకులు తప్పవని విశ్లేషించారు. సాధారణ ఎన్నికల సమయంలో ఇవి మరింత పెరిగేందుకు ఆస్కారం ఉందన్న ఆయన బడ్జెట్, ఎన్నికల వంటి కీలక ప్రకటనల తరువాత కానీ దీర్ఘకాలిక అంచనాకు రాలేమని చెప్పారు. తగ్గిన ముడిచమురు ధరల కారణంగా ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌కు అనుగుణంగా వ్యయం పెరుగుతుందని వివరించారు. స్థూల ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం క్రూడ్ ధర ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏడాది పరంగా చూస్తే 17.3 శాతం పడిపోయినప్పటికీ.. గడిచిన 5 ఏళ్లలో లార్జ్‌క్యాప్ ఇండెక్స్‌ను అవుట్పెర్ఫార్మ్ చేసిందన్నారు. ఏడాదికి 6.2 శాతం చొప్పున చక్రగతి వృద్ధిరేటును నమోదుసిందన్న ఆయన.. ప్రస్తుతానికైతే వీటి వ్యాల్యుయేషన్స్ ఏమంత ఆకర్షణీయంగాలేవన్నారు. అయితే, బోటమ్ అప్ స్టాక్ పికింగ్ అవకాశం కొనసాగుతుందని వివరించారు.
You may be interested
పెట్రో షేర్ల పతనం
Friday 30th November 2018ముంబై:- పెట్రోరంగ కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ పతనమయ్యాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర క్షీణించిన నేపథ్యంలో భారీ ర్యాలీ జరిపిన ఈ షేర్లలో నేడు లాభాల స్వీకరణ జరుగుతుందని విశ్లేషకుల అంచనా. హెచ్‌పీసీఎల్:- నేడు ఎన్ఎస్ఈలో రూ.242.95ల వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో షేరు 5శాతం పతనమై రూ.230.30ల కనిష్టానికి తగ్గింది. మధ్యాహ్నం గం.2:30లకు షేరు గతముగింపు ధర(రూ.242.90)తో పోలిస్తే 4శాతం లాభపడి రూ.233.40ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే
రెండంకెల రాబడినిచ్చే 2 స్టాక్స్
Friday 30th November 2018ఐసీఐసీఐ డైరెక్ట్ టెక్నికల్ హెడ్ ధర్మేశ్ షా తాజాగా వచ్చే ఆరు నెలల కాలంలో రెండంకెల రాబడిని అందించే రెండు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒక సారి చూద్దాం.. ఏబీబీ ఏబీబీ షేరు ధర గత రెండేళ్లుగా ఓవరాల్‌గా చూస్తే అప్‌ట్రెండ్‌లో ఉంటూ వస్తోంది. రానున్న కాలంలో స్టాక్ ధర రూ.1,320- 1,330 వద్ద కన్సాలిడేట్ అవ్వొచ్చు. ఇక 50 రోజుల ఎక్స్‌పొన్షియల్ మూవింగ్ యావరేజ్ దాదాపు రూ.1,316 స్థాయి వద్ద