STOCKS

News


ఈ మూడు రంగాల హవా ఉంటుంది..: మోర్గాన్‌స్టాన్లీ

Tuesday 9th April 2019
Markets_main1554749068.png-25010

గత కొన్ని త్రైమాసికాల్లో కార్పొరేట్‌ ఫలితాలు మిశ్రమంగా లేదా అంచనాల కంటే తక్కువగా ఉండడం చూశాం. చమురు ధరల పెరుగుదల, అమెరికా డాలర్‌ ర్యాలీ, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇవన్నీ ఆర్థిక రంగంపై, మార్కెట్లపై ప్రభావం చూపించాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ విషయమై బ్రోకరేజీ సంస్థల్లో ఆశాభావం వ్యక్తం అవుతోంది. 2019-20, 2020-21లో కనీసం 20 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్స్‌ వృద్ధిని నడిపించనున్నాయని అంచనా. 

 

2020 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ ఈపీఎస్‌ 24.8 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ తన తాజా నివేదికలో అంచనా వ్యక్తం చేసింది. కార్పొరేట్‌ బ్యాంకులను మినహాయిస్తే నిఫ్టీ లాభాలు 14 శాతం పెరుగుతాయని పేర్కొంది. సెన్సెక్స్‌ కంపెనీల విషయానికొస్తే 24 శాతం ఎర్నింగ్స్‌ వృద్ధిని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఇండెక్స్‌ 2019 డిసెంబర్‌ నాటికి 42,000కు చేరొచ్చని పేర్కొంది. సెన్సెక్స్‌ లాధదాయకత విషయంలో తన అంచనాలకు వెనుకనున్న అంశాలను తెలియజేసింది. రూపాయి ఇకమీదట అధిక వ్యాల్యూషన్‌లో ఉండకపోవడం, కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌ సైకిల్‌ ఆరంభం కావడం, రిస్క్‌ తీసుకునే సామర్థ్యం తిరిగి ఏర్పడడం, ధరల శక్తి తిరిగి కంపెనీలకు రావడం, బలమైన జీడీపీ వృద్ధి అంచనాలు, జీడీపీలో అత్యంత కనిష్ట స్థాయి లాభాల నుంచి భారత్‌ బయటకు రావడం వంటి అంశాలను పేర్కొంది. రానున్న ఎర్నింగ్స్‌ సైకిల్‌లో దేశీయ సైక్లికల్స్‌ అయిన కన్జ్యూమర్‌, ఇండస్ట్రియల్స్‌, ఫైనాన్షియల్స్‌ (బ్యాంకులు సహా), ఎంపిక చేసిన నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో కొనుగోళ్లు చేసుకోవచ్చని సూచించింది. ఈ రంగాలపై అధిక వెయిటేజీతో మోర్గాన్‌ స్టాన్లీ ఉంది. టెక్నాలజీ, ఫార్మా  రంగాల పట్ల అండర్‌ వెయిటేజీ ప్రకటించింది. దేశీయ సైక్లికల్స్‌లో ముఖ్యంగా ఆటో, హోటల్స్‌, ఎయిర్‌లైన్స్‌, సిమెంట్‌ రంగాలను సూచించింది. 

 

‘‘డిమాండ్‌ పెరగడంతో ధరల పరంగా అధికారం తిరిగి కంపెనీలకు లభించింది. డీమోనిటైజేషన్‌, జీఎస్టీ అమలు వంటి ఏకకాల కుదుపులను ఆర్థిక వ్యవస్థ సర్దుబాటు చేసుకుంది. రానున్న త్రైమాసికాల్లో ఆదాయాలు పుంజుకుంటాయి. కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం మరింత వృద్ధి అనుకూలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధిలోనే ఉంది’’ అని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. ప్రైవేటు పెట్టుబడుల సైకిల్‌ మంచిగా ఉంటుందని, ఇండస్ట్రియల్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఇప్పటికే వీటి ఆర్డర్ల బుక్‌ మెరుగుపడినట్టు తెలిపింది. రుణాల వృద్ధి సైతం వేగాన్ని అందుకుంటుందని, పెద్ద బ్యాంకులు, మంచి డిపాజిట్‌ ఫ్రాంచైజీలు ఉన్న వాటికి సానుకూలమని పేర్కొంది. ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా ఉండడం, అధిక వాస్తవ రేట్లు, అంతర్జాతీయ వాణిజ్యం, వృద్ధి పరంగా రిస్క్‌లున్నట్టు తెలిపింది.



You may be interested

ఎల్‌వీబీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ విలీనం ప్రయోజనమేనా?

Tuesday 9th April 2019

లక్ష్మీవిలాస్‌ బ్యాంకు (ఎల్‌వీబీ), ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ కంపెనీలో విలీనానికి ఇరు కంపెనీల బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. ప్రతీ 100 ఎల్‌వీబీ షేర్లకు 14 ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ షేర్లు కేటాయించాలన్నది నిర్ణయం. ఏప్రిల్‌ 5న ఎల్‌వీబీ క్లోజింగ్‌ ధరతో పోలిస్తే 35 శాతం ప్రీమియం చెల్లింపునకు నిర్ణయం జరిగింది. గత ఆరు నెలల ఎల్‌వీబీ సగటు ధర కంటే 63 శాతం ప్రీమియం కట్టినట్టు అవుతుంది. ఈ నిర్ణయం తర్వాత ఎల్‌వీబీ

11550 కోల్పోతే షార్ట్‌ చేయండి!

Monday 8th April 2019

నిఫ్టీపై కోటక్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11550 పాయింట్ల దిగువన క్లోజయితే కరెక‌్షన్‌ తప్పదని, అలాంటి సందర్భంలో నిఫ్టీని షార్ట్‌ చేయాలని కోటక్‌ సెక్యూరిటీస్‌ సలహౠ ఇస్తోంది. సూచీల్లో నిఫ్టీ స్పిన్నింగ్‌ టాప్‌ను ఏర్పరిచింది. ఇలాంటి డోజీ ఏర్పడడం అస్పష్టతకు సంకేతం. సాధారణ మార్కెట్లో డోజీ ఎలాంటి దిశా నిర్ధేశం చేయదు, కానీ అప్‌ట్రెండ్‌ లేదా డౌన్‌ట్రెండ్‌లో డోజీ ట్రెండ్‌ రివర్సల్‌ను సూచిస్తుంటుంది. అప్‌ట్రెండ్‌లో

Most from this category