STOCKS

News


డిస్కౌంట్‌లో 32 నిఫ్టీ షేర్లు

Tuesday 13th August 2019
Markets_main1565687047.png-27738

మార్కెట్లు పతనం కారణంగా చాలా వరకు టాప్‌ కంపెనీల స్టాకుల వాల్యుషన్‌ తగ్గింది. దీర్ఘకాల వాల్యుషన్‌తో పోల్చుకుంటే ప్రస్తుతం ఈ స్టాకులు డిస్కౌంట్‌తో  ట్రేడవుతున్నాయి. నీఫ్టీ 50 ఇండెక్స్‌లోని సగానికి పైగా స్టాకులు వాటి పదేళ్ల పీఈ(ప్రైస్‌ టూ ఎర్నింగ్స్‌) నిష్పత్తి సగటుతో పోల్చుకుంటే రాయితీతో ట్రేడవుతున్నాయి. పదేళ్ల పీబీ(ప్రైస్‌ టూ బుక్‌) నిష్పత్తి సగటుతో పోల్చుకుంటే నిఫ్టీ 50లోని 32 స్టాకులు ప్రస్తుతం డిస్కౌంట్‌తో ట్రేడవుతుండడం గమనార్హం.  అయినప్పటికి నిఫ్టీ మాత్రం తన పదేళ్ల పీఈ నిష్పత్తి సగటుకు పైన ట్రేడవుతోందని మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజి సంస్థ తెలిపింది. నిఫ్టీ పదేళ్ల పీఈ సగటు 17.9 రెట్లుగా ఉండగా, ప్రస్తుతం నిఫ్టీ పీఈ 18.2 రెట్లు వద్ద ట్రేడవుతోంది. దీని పీబీ మల్టిపుల్స్‌ మాత్రం ప్రస్తుతం, పదేళ్ల పీబీ సగటుకు అనుగుణంగానే ఉంది. 
   ఇండియా టాప్‌ 50 స్టాకులలో ఉన్న బలహీనతను ఈ ట్రెండ్‌ తెలియజేస్తోందని విశ్లేషకులు తెలిపారు. ‘నిఫ్టీ కదలికను గత కొన్నెళ్ల నుంచి కొన్ని స్టాక్సు మాత్రమే నిర్ణయిస్తున్నాయి’ అని షేర్‌ఖాన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌, గౌరవ్‌ దూ అన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ వంటి స్టాకులు నిఫ్టీ గమనానికి కారణమయ్యాని వివరించారు. ప్రభుత్వ రంగ కంపెనీలు వాటి దీర్ఘకాల పీఈతో పోల్చుకుంటే రాయితీతో ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం ఓఎన్‌జీసీ తన పదేళ్ల పీఈ నిష్పత్తి కంటే 51 శాతం రాయితీతో ట్రేడవుతోంది. అదే విధంగా భారత్‌ పెట్రోలియం 27 శాతం రాయితీతో, గెయిల్‌ 39 శాతం రాయితీతో ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లతో పాటు ఆటో సెక్టార్‌ షేర్లు కూడా రాయితీతో ట్రేడవుతున్నాయి. మహింద్రా అండ్‌ మహింద్రా(ఎం అండ్‌ ఎం), హీరో మోటర్‌ కార్ప్‌,  తమ పదేళ్ల పీఈ నిష్పత్తి సగటు కంటే 15 శాతం రాయితీతో ట్రేడవుతున్నాయి. ఆర్థిక మందగమనం, వినియోగం తగ్గడంతో ఆటోరంగ కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోయిన విషయం తెలిసిందే. దీర్ఘకాల పీబీ నిష్పత్తి సగటుతో పోల్చుకుంటే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 12 శాతం రాయితీతో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ 47 శాతం రాయితీతో ట్రేడవుతున్నాయి. ‘మ్యూచువల్ ఫండ్ నగదులో అధిక భాగం కొద్ది స్టాక్‌ల కొనుగోలుకు మాత్రమే వినియోగించారు. అందువలన మార్కెట్‌లో మొత్తంగా అమ్మకాల వాతవరణం కనిపిస్తోంది’ అని ఈక్వినోమిక్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి. చోక్కిలింగం అన్నారు. డిమాండ్ మందగించడం, పేలవమైన కార్పోరేట్‌ ఆదాయాలు, రుతుపవనాల అనిశ్చితి వంటి అనేక ఆందోళనలు ఇన్వెస్టర్లను వెంటాడుతున్నాయని తెలిపారు. 



You may be interested

అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు

Tuesday 13th August 2019

రూపాయి బలహీనపడినప్పటికీ.., మం‍గళవారం ఐటీ షేర్ల అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం పతనమైంది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ షేర్ల పతనం 2శాతం వరకు క్షీణించడం ఇతర ఐటీ షేర్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. నేడు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 15,809 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఐటీ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి

ఆగని యస్‌ బ్యాంక్‌ షేర్ల పతనం

Tuesday 13th August 2019

మరో 10శాతం క్షీణించిన షేర్లు  యస్‌బ్యాంక్‌ షేర్ల పతనం పతనం ఆగడం లేదు. మంగళవారం మరో 10శాతం నష్టపోయాయి. నేడు బీస్‌ఈలో రూ.84.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో షేర్లు ఒకదశలో 10.50శాతం నష్టపోయి రూ.73.40ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమయ్యాయి. ఈ స్థాయి షేర్లకు ఐదేళ్ల లేదా 6 ఏళ్ల కనిష్టస్థాయి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయం. ఏదశలోనూ రివకవరి సాధించకపోవడంతో మిడ్‌సెషన్‌

Most from this category